Begin typing your search above and press return to search.

దిమాగీ నక్సల్స్..బ్రహ్మ పదార్ధమా....మోడీ బ్రహ్మాస్త్రమా !

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన ప్రసంగాల్లో 'దిమాగీ నక్సల్స్' అనే పదాన్ని పదే పదే ఉపయోగిస్తున్నారు. బస్తర్‌లో భద్రతా దళాలతో దీపావళి జరుపుకున్న సందర్భంగా కూడా మేధో నక్సలైట్లతో దేశానికి ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు, సంస్థల్లోకి చొరబడి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే మేధావులపై ఈ పదప్రయోగం రాజకీయ చర్చకు దారితీస్తోంది.

By:  Satya P   |   9 Nov 2026 9:12 AM IST
దిమాగీ నక్సల్స్..బ్రహ్మ పదార్ధమా....మోడీ బ్రహ్మాస్త్రమా !
X

ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ తన ప్రసంగాలలో ఎక్కువగా ఒక మాట అంటున్నారు. దిమాగీ నక్సల్స్ అని పదే పదే వాడుతున్నారు. అది దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగం నుంది ఆయన సందర్భం వచ్చినపుడల్లా మాట్లాడుతున్నారు. ఇక తాజాగా బస్తర్ లో మోడీ దీపావళి ఉత్సవాలను భద్రతా దళాలతో కలసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి దిమాగీ నక్సల్స్ అన్నారు. అలాగే మేధో నక్సలైట్లు అని కూడా విమర్శించారు. వారితోనే అసలైన ముప్పు దేశానికి అని కూడా మోడీ చెప్పుకొచ్చారు. వారిని ఓడించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

ఇటీవల పరిణామాలు :

గడచిన కొన్ని నెలలుగా చూస్తే దేశంలో వివిధ అంశాల మీద ఉద్యమాలు సాగుతున్నాయి. మొదట నీట్ పేపర్ లీకేజ్ మీద ఉద్యమించారు. ఇపుడు చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం మీద పోరాటం చేస్తున్నారు. సంప్రదాయ రాజకీయ పార్టీల పోరాటాలు నిరసనలు ఒక ఎత్తు అయితే సీజేపీ లాంటి వేదికల మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మాట్లాడుతున్న వారిలో పౌర సమాజం నుంచి మేధావులుగా ఉన్న వారు కనిపిస్తున్నారు. అంతే కాదు వివిధ సంఘాల నుంచి వివిధ సంస్థల నుంచి వచ్చిన వారు మాట్లాడుతున్న వారు ఉన్నారు. ప్రభుత్వం మీద వారి విమర్శలు గట్టిగానే ఉంటున్నాయి. దాంతో వీరి విషయంలో బీజేపీ మేధో నక్సలైట్లు అన్న భావనతో విమర్శలు చేస్తోంది అంటున్నారు. అంతే కాదు వివిధ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిని దిమాగీ నక్సల్స్ అని కూడా విమర్శిస్తోంది. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని జనాలకు మోడీ పిలుపు ఇస్తున్నారు.

చొరబడ్డారు అంటూ :

దిమాగీ నక్సల్స్ వివిధ రాజకీయ పార్టీలలో అలాగే ఇతర సంస్థలలో ఇప్పటికే చొరబడ్డారని మోడీ ఆరోపించారు. అలాంటి వారి కుట్రలను గుర్తించి వారిని పూర్తిగా ఓడించి దేశాన్ని రక్షించుకోవాలి అంటూ మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇప్పటికే దేశం నక్సల్స్ ని లేకుండా చేసుకుందని అన్నారు. అలా తుపాకీ పట్టిన నక్సల్స్ అంతం అయ్యారని కానీ ఇపుడు ఆ ప్లేస్ లో నేరుగా సమాజంలోనే దిమాగీ నక్సల్స్ తయారు అయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలనే చేశారు. ఇలా దిమాగీ నక్సల్స్ నునిచ్ దేశానికి అసలైన ముప్పు పొంచి ఉందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.

వారు పోయారు కానీ :

ఇక అడవులలో ఉంటూ సాయుధులైన నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం నిర్మూలించిందని మోడీ చెప్పారు. అది అతి పెద్ద విజయమే కావచ్చు కానీ అంతకంటే ప్రమాదం దిమాగీ నక్సల్స్ నుంచే ఉందని అన్నారు. వీరంతా అనేక సంస్థలలో ఇప్పటికే తిష్ట వేశారు అని మోడీ విమర్శించారు. వారు దేశానికి రాజ్యాంగానికి ప్రజాస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు అని ఆయన అన్నారు. దీని భావమేంటి అంటే ఇటీవల దేశంలో జరుగుతున్న ఉద్యమాల వెనక ప్రజాస్వామ్యం అంటూ జనంలోకి వస్తున్నారు అని మోడీ సూటిగానే వారి మీద విమర్శలు ఎక్కు పెట్టారు. మరి మోడీ చెబుతున్న దిమాగీ నక్సల్స్ అన్నది జనంలోకి ఎక్కుతుందా అన్నదే చర్చగా ఉంది.

జనాలకు ఎక్కుతుందా :

మేధావులను బుద్ధి జీవులను దిమాగీ నక్సలైట్లు అని బీజేపీ విమర్శలు చేస్తోంది అని పౌర సమాజం నుంచి ఎదురు విమర్శలు వస్తున్నాయి. అయితే దేశంలో అశాంతి అలజడులను రెచ్చగొట్టడానికే ఈ విధంగా కొంతమంది తయారు అయ్యారని బీజేపీ అంటోంది. మోడీ అయితే వీరి నుంచి పెద్ద ముప్పు అంటున్నారు. దేశాన్ని ఐక్యతను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఇటీవల గుజరాత్ పర్యటనలో కూడా ఆయన ప్రజలను కోరారు. మరి దిమాగీ నక్సల్స్ అంటే విపక్షం నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో అలాగే పౌర సమాజం స్పందన ఏ తీరుగా ఉంటుందో చూడాల్సి ఉంది.అన్నింటికీ మించి ప్రజలకు దిమాగీ నక్సల్స్ అన్నది అర్ధం అవుతుందా లేక బ్రహ్మ పదార్ధంగా మారుతుందా అసలు ఈ పద ప్రయోగం వెనక బీజేపీ వ్యూహాలేమిటి అన్నది కూడా చర్చకు వస్తున్న విషయంగా ఉంది.