Begin typing your search above and press return to search.

మోడీ మంత్రం: కాద‌న్న‌వారే.. క‌లిసి వ‌చ్చారు..!

పార్లమెంట్ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన డీఎంకే, ఎన్సీపీ, బీఆర్ఎస్ ఇప్పుడు మద్దతు దిశగా అడుగులు వేస్తున్నట్లు కథనం పేర్కొంది. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బిల్లులకు మద్దతు పెరుగుతున్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

By:  Garuda Media   |   29 Nov 2026 12:00 AM IST
మోడీ మంత్రం: కాద‌న్న‌వారే.. క‌లిసి వ‌చ్చారు..!
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మంత్రం వేస్తే.. దిగిరాని వారు.. క‌లిసి రాని వారు అంటూ ఎవ‌రు ఉండ‌ర‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో త‌ర‌చుగా జ‌రిగే చ‌ర్చ‌. తాజాగా పార్ల‌మెంటు స్థానాల పెంపుతోపాటు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వ్య‌వ‌హారాల విష‌యంలోనూ ఇప్పుడు ఆయ‌న అదే పంథాను అనుస‌రిస్తున్నారు. ఒక‌ప్పుడు కాద‌న్న‌వారే.. ఒక‌ప్పుడు వీటిని తీవ్రంగా వ్య‌తిరేకించిన వారే.. ఇప్పుడు మోడీ వెంట న‌డిచేందుకు స‌ద‌రు బిల్లుల‌కు జై కొట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ బిల్లులకు మ‌ద్ద‌తు రోజు రోజుకు పెరుగుతోంది.

డీఎంకే..

త‌మిళ‌నాడు మాజీ అధికార పార్టీ డీఎంకే ఆది నుంచి కూడా పార్ల‌మెంటుస్థానాల పెంపున‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించింది. పెంపును త‌ప్పుబ‌ట్ట‌క‌పోయినా.. అనుస‌రించిన విధానం మాత్రం స‌రికాద‌నిపేర్కొంది. మాజీ సీఎం స్టాలిన్ అయితే.. అస‌లు ఈ విష‌యంలో త‌గ్గేదేలేదు.. అని తేల్చి చెప్పారు. దీనికి కార‌ణం.. జ‌నాభాను తాము నియంత్రించామ‌ని.. కాబ‌ట్టి.. ఇప్పుడు పెంపుతో త‌మ‌కు న‌ష్టం వ‌స్తుంద‌ని ఆయ‌న వాదిస్తూ వ‌చ్చారు. కానీ, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్ర‌ధాన మిత్ర‌ప‌క్షం కాంగ్రెస్ హ్యాండిచ్చి.. టీవీకే విజ‌య్‌తో క‌లిసి అధికారం పంచుకుంది.

దీంతో డీఎంకే ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని.. ``50 శాతం పెంపు ఉంటుంద‌ని అంటున్నారు కాబ‌ట్టి`` అంటూ.. మ‌ద్ద‌తు ఇచ్చేందుకు రెడీ అయింది. వాస్త‌వానికి అప్ప‌ట్లోనూ కేంద్రం ఈమాటే చెప్పింది. కానీ, అప్పుడు స్టాలిన్ స‌సేమిరా అన్నారు. కానీ, ఇప్పుడు రాజ‌కీయంగా తాము ఒంటరి అవుతున్నామ‌ని గ్ర‌హించ‌డంతోపాటు.. కాంగ్రెస్‌పార్టీకి బుద్ధి చెప్పాల‌న్న ల‌క్ష్యంతో ఆయ‌న త‌న పంథాను మార్చుకున్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ విష‌యంలోనూ ఇదే విధంగా స్పందించారు. సో.. డీఎంకే ఎంపీలు గుండుగుత్త‌గా ఈ బిల్లుల‌కు ఆమోదం తెల‌ప‌నున్నారు.

ఎన్సీపీ..

మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎన్సీపీ పార్టీ కూడా యూట‌ర్న్ తీసుకుంది. మాజీ కేంద్ర మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎప్పుడో రెండుగా చీలిపోయింది. ఈ అస్తిత్వం కాపాడుకునేందుకు ఆయ‌న ప్ర‌యాస ప‌డుతున్నారు. మ‌రోవైపు త‌న కుమార్తెకు ప్యూచ‌ర్ కూడా ఆయ‌న‌కు చాలా ఇంపార్టెంటుగా మారింది. ఈ ప‌రిణామాల‌తో కేంద్రంలో త‌న కుమార్తెకు మంత్రిపీఠం విష‌యంపై అన్నీ సెటిల్ చేసుకున్న ఆయ‌న‌.. తాజాగా బిల్లుకు ఆమోదం తెలిపే విష‌యంపై ``సానుకూలంగా`` యోచిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఒక‌ప్పుడు.. ఈ బిల్లుల‌ను వ్య‌తిరేకించారు.

బీఆర్ఎస్‌..

అధికారంలో ఉండ‌గా.. నిత్యం కేంద్రంపైనా.. మోడీపైనా నిప్పులు చెరిగిన తెలంగాణ మాజీ అధికార పార్టీ బీఆర్ ఎస్ కూడా ఇప్పుడు అస్తిత్వ పోరాటంలోనే ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు.. అవ‌కాశంగా భావిస్తూ.. డీలిమిటేష‌న్ స‌హా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులకు మ‌ద్ద‌తు తెలిపేందుకు దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఏదేమైనా.. ఒక‌ప్పుడు మోడీని వ్య‌తిరేకించిన వారు.. ముఖ్యంగా ఈ బిల్లుల‌ను వ్య‌తిరేకించిన వారు కూడా ఇప్పుడు మోడీ బాట‌లోనే ప్ర‌యాణం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.