మోదీ క్రికెట్ పోలికకు నవ్విన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. వైరల్ వీడియో
రాజకీయాల్లో ‘దౌత్యం’ అంటే బోర్ కొట్టే సుదీర్ఘ ప్రసంగాలు.. ముఖంపై నవ్వు లేని సీరియస్ చర్చలు అనుకుంటే పొరపాటే.
By: A.N.Kumar | 9 July 2026 3:34 PM ISTరాజకీయాల్లో ‘దౌత్యం’ అంటే బోర్ కొట్టే సుదీర్ఘ ప్రసంగాలు.. ముఖంపై నవ్వు లేని సీరియస్ చర్చలు అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు అసలు కాదు.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన లో మోదీ గారు భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని ఏకంగా క్రికెట్ గ్రౌండ్‌లోకి లాగేశారు. దౌత్య నీతిని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి కంటే ఈజీగా వివరించడంతో.. అల్బనీస్ గారు నవ్వాలో, చప్పట్లు కొట్టాలో తెలియక రెండు కలిపి చేసేశారు.
ఆ మూడు ఫార్మాట్లు.. మన దౌత్య సూత్రాలు
పెద్ద పెద్ద దౌత్యవేత్తలు లావుపాటి పుస్తకాల్లో రాసే ఇండో-ఆసీస్ బంధాన్ని మోదీ గారు కేవలం మూడు ముక్కల్లో తేల్చేశారు. వన్డే మ్యాచ్ లాంటి అజెండాలాగా మన ఇరు దేశాల టార్గెట్ వన్డే మ్యాచ్ లాగా చాలా క్లియర్‌గా ఉంటుంది. నెట్ రన్ రేట్ తగ్గకుండా, వికెట్లు పడకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లడమే మన పని. టీ20 లాంటి నిర్ణయాలు తీసుకుందాం. ఫాస్ట్ ఫుడ్ యుగంలో నిర్ణయాలు కూడా ఫాస్ట్‌గా ఉండాలి కదా.. అందుకే మన డెసిషన్స్ అన్నీ టీ20 మ్యాచ్‌లో పవర్‌ప్లే లాగా స్పీడ్‌గా, బౌండరీల వర్షంలా దూసుకుపోతాయి. ఇక టెస్ట్ మ్యాచ్ లాంటి భాగస్వామ్యం అవసరం. అసలైన మజా ఇక్కడే ఉంది. రోజులు మారినా, పిచ్ కండిషన్స్ మారినా.. ఐదు రోజుల పాటు ఓపికగా క్రీజులో నిలబడే టెస్ట్ మ్యాచ్ లాంటిది మన బంధం. అంటే అంత ఈజీగా ఈ పార్టనర్‌షిప్ బ్రేక్ అవ్వదన్నమాట..అంటూ మోడీ గారు భలేగా సమాధానమిచ్చారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, విద్య, ఇండో-పసిఫిక్ భద్రత లాంటి ఎన్నో ‘ఓవర్లు’ వేయాల్సి ఉంది. అందుకే ఈ క్రికెట్ ఫార్ములాను ఇద్దరు నేతలూ గట్టిగా నమ్మేలా ఉన్నారు.
అల్బనీస్ నవ్వు.. సోషల్ మీడియాలో హల్‌చల్
మోదీ గారు ఈ రేంజ్‌లో గూగ్లీలు, యార్కర్లు విసురుతుంటే ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాత్రం ఏం చేస్తారు? "భలే ప్లాన్ చేశారు బాస్" అన్నట్టుగా ఫుల్ ఖుషీ అయిపోయారు. క్రికెట్ అంటే పిచ్చి ఉన్న ఆస్ట్రేలియా, భారత్ ప్రజలకు ఈ పోలిక ‘ఫర్ఫెక్ట్ మ్యాచ్’ లాగా అనిపించింది.
సాధారణంగా దౌత్యపరమైన ప్రసంగాల్లో "మేము వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాము..." అంటూ బోర్ కొట్టించే పదాలు ఉంటాయి. కానీ ఇక్కడ మోదీ గారు "సిక్సర్లు, ఫోర్ల" భాషలో మాట్లాడేసరికి సభలో నవ్వుల పువ్వులు పూశాయి.
పిచ్ రిపోర్ట్.. బంధం గట్టిదే భయ్యా
నిజానికి భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో బాగా ‘ఫామ్’ లోకి వచ్చాయి. స్వచ్ఛ ఇంధనం, కీలక ఖనిజాల సరఫరా లాంటి పిచ్‌లపై ఇరు దేశాలూ జోరుగా స్కోర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ గారి చమత్కారం ఇరు దేశాల మధ్య ఉన్న ఈక్వేషన్‌ను మరింత క్రేజీగా మార్చేసింది.
ఏదేమైనా రాజకీయాల్లో ఈ స్థాయి టైమింగ్, కామెడీ టచ్ ఉండటం నిజంగా గ్రేట్. భవిష్యత్తులో ఈ ఇండో-ఆసీస్ పార్టనర్‌షిప్ వరల్డ్ కప్ గెలిచే రేంజ్‌లో సాగాలని.. ఎక్కడా ‘రనౌట్’ కాకూడదని మనమూ కోరుకుందాం..
