కాంగ్రెస్‌కు మోడీ కౌన్సెలింగ్.. ఏం చెప్పారంటే!
నిరంతరం .. ఉప్పు-నిప్పు మాదిరిగా మండిపడే బీజేపీ-కాంగ్రెస్ రాజకీయాల గురించి తెలిసిందే.
By: Garuda Media | 19 Jan 2026 9:53 AM ISTనిరంతరం .. ఉప్పు-నిప్పు మాదిరిగా మండిపడే బీజేపీ-కాంగ్రెస్ రాజకీయాల గురించి తెలిసిందే. పైగా ఎ న్నికల సమయం అనగానే మరింతగా ఈ వేడి రాజుకుంటుంది. అయితే.. పార్లమెంటు.. లేకపోతే ఎన్నికల సమయంలోనే ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోడీ కాంగ్రెస్ గురించి స్పందిస్తున్నారు. తాజాగా కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ వంటివి ఉన్నాయి. కేరళపై బీజేపీ ఆశలు పెద్దగా లేవు.
కానీ, బెంగాల్, అస్సాంలపై మాత్రం కమల నాథులకు ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం ప్రధాని మోడీ అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూనే.. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నానాటికీ దిగజారిపోతోందో తనదైన శైలిలో విశ్లేషించారు. ఒకరకంగా.. ఇది కాంగ్రెస్‌కు మోడీ చేసినకౌన్సిలింగేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాజకీయంగా విమర్శలకంటే.. కూడా కాంగ్రెస్ చేసిన , చేస్తున్న తప్పులను మోడీ ప్రస్తావించారు.
తద్వారా కాంగ్రెస్ వాటిని సమీక్షించుకుని ముందుముందు.. వాటి నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానిమోడీ ప్రధానంగా 4 తప్పులు ఎత్తి చూపారు. వీటి వల్లే కాంగ్రెస్ పార్టీ నానాటికీ దిగజారుతోందని.. ప్రజల మధ్య విశ్వాసాన్ని కోల్పోతోందని చెప్పారు. పైకి ఆయన రాజకీయంగా మాట్లాడినా.. వీటిని కాంగ్రెస్ నేతలు పాజిటివ్‌గా తీసుకుని సరిచేసుకునే ప్రయత్నం చేస్తే.. వారికే మంచిదని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రధాని ఏం చెప్పారంటే..
1) అభివృద్ది అజెండాకు కాంగ్రెస్ దూరమైంది.
2) వారసత్వ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు ఇంకా ప్రాధాన్యం ఇస్తోంది.
3) దేశ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటోంది.
4) ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటు దారులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది.
