Begin typing your search above and press return to search.

అనూహ్యమైన వ్యక్తి ఆర్థిక మంత్రిగా ?

ఇక నిర్మలా సీతారామన్ ఇప్పటిదాకా సుదీర్ఘకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఆమె తన పనితీరుతో బాగానే రాణించారు. అయితే ఆర్ధిక మంత్రిగా కొత్త వారిని తీసుకోవాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వం భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది.

By:  Satya P   |   18 Sept 2026 5:00 AM IST
అనూహ్యమైన వ్యక్తి ఆర్థిక మంత్రిగా ?
X

భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఆర్థిక మంత్రిగా ఉండాలంటే అత్యంత సమర్ధులు అయి ఉండాలి. ఇక గతానికి ఇప్పటికి చూస్తే దేశ ఆర్థిక వ్యవహారాలు నడపడం మరింత క్లిష్టతరం. ఎందుకంటే అమెరికా పెద్దన్న భారీ టారిఫ్ లతో వడ్డిస్తున్నారు. అదే విధంగా ఇంకో వైపు పశ్చిమాసియా సంక్షోభం ఉంది. అలాగే ఆర్థిక సంక్షోభం లో ప్రపంచం ఉంది. ఎల్ నినో ప్రభావంతో భారత దేశం అల్లాడుతోంది. ఈ నేపధ్యంలో కొత్త ఆర్ధిక మంత్రిగా కేంద్రంలో ఎవరు వస్తారు అన్న చర్చ సాగుతోంది. ఇక నిర్మలా సీతారామన్ ఇప్పటిదాకా సుదీర్ఘకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఆమె తన పనితీరుతో బాగానే రాణించారు. అయితే ఆర్ధిక మంత్రిగా కొత్త వారిని తీసుకోవాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వం భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది.

రాజకీయాలకు చెందని వారు :

కేంద్రంలో కొత్తగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే వారు రాజకీయాలకు చెందని వ్యక్తి అయి ఉంటారని అంటున్నారు. ఆయన బ్యూరో క్రాట్ అయినా నా లేక టెక్నో క్రాట్ అయినా కావచ్చు అని అంటున్నారు. భారత్ ఇపుడున్న పరిస్థితులను తట్టుకుని మరింత ముందుకు సాగాలీ అంటే కచ్చితంగా ఈ రెండు రంగాలలో నిపుణులు అయిన వారిలో ఒకరిని ఎంపిక చేస్తారు అని అంటున్నారు. అలా వచ్చిన వారిని కేంద్ర ఆర్ధిక మంత్రిగా తీసుకుని రాజ్యసభ ద్వారా నెగ్గిస్తారు అని అంటున్నారు. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దాని కంటే ముందు ప్రీ బడ్జెట్ పేరుతో వివిధ రంగాలలో ఆర్థిక మంత్రి చర్చలు జరపాల్సి ఉంటుంది. దాంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తొందరగా జరిపించి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకుంటారు అని అంటున్నారు.

ముహూర్తం కుదిరిందా :

ఇక చూస్తే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అన్నది గత నాలుగు నెలలుగా కేవలం ప్రచారానికే పరిమితం అవుతోంది. అదిగో ఇదిగో అంటూ నెలలు గడచిపోతున్నాయి. అయితే ఇపుడు కచ్చితంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిపి తీరాల్సిన అవసరం వచ్చేసింది అని అంటున్నారు. అక్టోబర్ లో కొన్ని రాజ్యసభ ఖాళీలు ఏర్పడుతున్నాయి అని అంటున్నారు. అలాగే కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారి రాజ్యసభ పదవీ కాలం ముగుస్తోంది. దాంతో వీలైతే ఈ నెలాఖరులోగా అయినా లేదా అక్టోబర్ లో దసరా ముందు కానీ మంత్రి వర్గ విస్తరణ కేంద్రంలో ఉండొచ్చు అని అంటున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే చాలా మంది కొత్త వారికి యువతకు అవకాశాలు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.

భారీ మార్పుల దిశగానే :

ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అంటూ చేపడితే 2029 ఎన్నికల్లోగా చేపట్టే అతి పెద్ద విస్తరణ ఇదే అవుతుంది అని అంటున్నారు. ఒక విధంగా ఎన్నికల మంత్రి వర్గంగా కూడా దీని కూర్పు ఉండొచ్చు అని అంటున్నారు. అంతే కాదు 2027లో దేశంలో జరిగే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా అవసరం అయిన చోట్ల కొత్త మంత్రులను తీసుకోవాలని కూడా చూస్తున్నారు. దాంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అన్నది సరైన సమయంలో జరిగి తీరుతుంది అన్నది ఢిల్లీ వర్గాలలో వినిపిస్తున్న మాటగా ఉంది.