Begin typing your search above and press return to search.

రెబెల్ ఎంపీలకు మోడీ అనూహ్య మద్దతు !

ఉన్నాను నేను, మీకు అందరికీ అండగా ఉంటాను. ఇది బీజేపీ అగ్ర నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ.

By:  Satya P   |   8 Aug 2026 9:22 AM IST
రెబెల్ ఎంపీలకు మోడీ అనూహ్య మద్దతు !
X

ఉన్నాను నేను, మీకు అందరికీ అండగా ఉంటాను. ఇది బీజేపీ అగ్ర నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ. ఆయన తన సొంత పార్టీలకు అలాగే ఎన్డీయే మిత్ర పార్టీలకు కూడా ఈ భరోసా ఎపుడూ ఇస్తున్నది. తాజాగా మరోసారి కూడా ఇచ్చారు. అయితే ఇది ఇపుడు విశేషం కాదు, ఆయన రెబెల్ ఎంపీలకు తాను అండగా ఉన్నాను అంటూ ఇచ్చిన అనూహ్యమైన మద్దతు గురించే అంతా చర్చిస్తున్నారు. మోడీ తాజా వ్యాఖ్యలే ఇపుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మోడీ ఎపుడు ఎక్కడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అంటే అది ఆసక్తికరమైన విషయమే మరి.

ఆందోళన వద్దు అంటూ :

ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఎన్డీయే ఎంపీలతో అల్పాహార సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్డీయేకు చెందిన ఎంపీలు 192 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో పాటుగా తొలిసారిగా రెబెల్ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. వారే తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 20 మంది రెబెల్స్ అలాగే శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలు అన్న మాట. వీరు ఫస్ట్ టైం మోడీతో కలసి అల్పాహార విందుకు హాజరు కావడం మాత్రం అతి పెద్ద చర్చకు దారి తీసింది. గత పార్లమెంట్ సెషన్ వరకూ ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ లో ఎంపీలుగా ఉన్న వారు అంతా ఇపుడు ఒక్కసారిగా అధికార శిబిరం వైపు జంప్ చేశారు. దాంతో పాటు పార్లమెంట్ లో వారిని ప్రత్యేక వర్గంగా గుర్తించారు. దీని మీద ప్రతిపక్షాల నుంచి సొంత పార్టీ నుంచి కూడా ఈ రెబెల్ ఎంపీలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి విషయం మీదనే మోడీ కీలక హామీ ఇచ్చారని చెబుతున్నారు.

అభివృద్ధి అజెండాగానే :

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే అల్పాహార సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీలు, శివసేన యూబీటీ రెబెల్ ఎంపీలతో మాట్లాడుతూ ఎవరి గురించి ఆందోళన చెందవద్దు అని చెప్పారు. తాను వారికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. అంతే కాదు రెబెల్ ఎంపీల మీద వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. ఇక ఎన్డీయేలోని ప్రతి ఎంపీకి తాను అండగా ఉంటానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతా ఎంపీలంతా వారి నియోజకవర్గాల్లో ప్రజలతో నిత్యం మమేకం కావాలని మోడీ దిశా నిర్దేశం చేశారు. ఎంపీలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

నిధుల వరద పారుతుందని :

నియోజకవర్గాల అభివృద్ధి కోసం నేరుగా పీఎంవోను సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు. దాంతో రెబెల్ ఎంపీల నియోజకవర్గాలలో నిధుల వరద పారుతుందని అంటున్నారు. మరో మూడేళ్ళ పాటు వారికి చేతిలో అధికారం ఉంటుంది. దాంతో తమ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులు చేసి చూపించి మళ్ళీ నెగ్గాలని వారంతా చూస్తున్నారు. ఇక తాను ఉన్నాను అని మోడీ నుంచి అనూహ్యమైన మద్దతు వారికి దక్కడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం దీని మీద విమర్శలు చేస్తున్నారు. తమ పార్టీలలో ఉన్న ఎంపీలను అధికార పక్షం ఆకర్షించి ఈ విధంగా చీలుస్తోంది అని తృణమూల్ కాంగ్రెస్ శివసేన యూబీటీ అధినాయకత్వాలు ఇప్పటికే మండిపోతున్న సంగతి తెలిసిందే.