Begin typing your search above and press return to search.

వైసీపీని అలా మోడీ ఖుషీ చేశారా ?

ఇక చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విషయంలో వేదిక మీద వరుసగా కూటమి పెద్దల ప్రసంగాలు గమనిస్తే ఆసక్తికరంగానే ఉన్నాయని అంటున్నారు.

By:  Satya P   |   3 Aug 2026 9:38 AM IST
వైసీపీని అలా మోడీ ఖుషీ చేశారా ?
X

అదేంటో ఏపీలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాల కంటే రాష్ట్రంలో ప్రత్యర్థుల మీద ఫోకస్ నే ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ విషయంలో వేరే ఆలోచన అయితే ఉండదని కూడా కామెంట్స్ పడుతున్నాయి. ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య ఉప్పు నిప్పుగా పరిస్థితి ఉందని అందరికీ తెలిసిందే. రాజకీయంగా ప్రత్యర్ధుల స్థాయిని ఈ రెండు పార్టీలూ ఎపుడో దాటేశాయి. ఒకరిని ఒకరు ముఖాముఖాలు అధినేతలు కూడా చూసుకోని వాతావరణం దేశంలో ఒక్క ఏపీలోనే కనిపిస్తుందని కూడా అంటారు. ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయం కేంద్ర పెద్దలకు కూడా బాగా కలసి వస్తోంది అని అంటున్నారు. దాంతో ఏపీకి వస్తున్న బీజేపీ పెద్దలు నొప్పించక తనొవ్వక అన్నట్లుగా వ్యవహరిస్తూ అందరి దగ్గర మంచిగా ఉండే తమ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అని అంటున్నారు.

అంతా విమర్శించినా :

ఇక చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విషయంలో వేదిక మీద వరుసగా కూటమి పెద్దల ప్రసంగాలు గమనిస్తే ఆసక్తికరంగానే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో కూటమి పార్టీలు అంటే బీజేపీని మినహాయిస్తే టీడీపీ జనసేన నేతల నోటి వెంట ఎర్ర బస్సు ఎయిర్ బస్సు అన్న విమర్శ కామన్ గా వినిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్సు ఎందుకు అని జగన్ అన్నారని కానీ తాము ఆచరణలో చేసి చూపించామని గట్టిగా చెప్పారు. ఆ విధంగా తమ గొప్పతనం తో పాటు ప్రత్యర్ధి వీక్ పాయింట్ ని కూడా జనాలకు విడమరచి చెప్పారు. అయితే ఇదే వేదిక మీద మొదట ప్రసంగించిన బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అయితే ఈ విమర్శ చేయలేదు, ఆయన మోడీకే అంతా క్రెడిట్ అంటూ మాట్లాడారు. ఆఖరుగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అయితే తమ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 2014 నుంచి ఈ రోజు దాకా రెట్టింపు విమానాశ్రయాలను నిర్మించామని చెప్పారు. గతంలో 74 ఉంటే ఇపుడు ఆ సంఖ్య 166 కి చేరింది అన్నారు. అదే సమయంలో ఏపీలో అభివృద్ధి కేంద్రం చేస్తున్న సాయం గురించి మాత్రమే చెప్పారు తప్ప విపక్షం అయిన వైసీపీ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణాలో అయితే :

అదే నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన చేస్తే అక్కడ విపక్షాలను రాజకీయంగా చెడుగుడు ఆడుతారు అన్నది తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ని తేడా లేకుండా ఆయన గట్టిగా విమర్శిస్తారు అని కూడా గుర్తు చేస్తున్నారు. కానీ ఏపీలో విపక్షంగా వైసీపీ ఉంది, పైగా 2024 ఎన్నికల్లో కూటమి పోటీ చేసి నెగ్గింది కూడా వైసీపీ మీదనే. మరి కూటమిలో ఉన్న బీజేపీ వైసీపీ గురించి పెద్దగా మాట్లాడకపోవడం అన్నది గతంలోనూ జరుగుతూ వస్తోంది. కేంద్ర పెద్దలు కదా రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చరు అనుకుంటే ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడి స్థానిక విపక్షాన్ని విమర్శించడం మోడీ సహా పెద్దలు అంతా చేస్తున్నారు. ఏపీలోనే చిత్రంగా ఆ తరహా విమర్శలు లేవని అంటున్నారు.

వైసీపీకి ఆనందమేనా :

ఏపీలో కూటమి నేతలు తమని ఎంత విమర్శించినా మోడీ మాత్రం విమర్శించలేదు కదా అన్నదే వైసీపీ నేతల ఆనందంగా ఉందని అంటున్నారు. నిజానికి మోడీ కానీ బీజేపీ కానీ విమర్శించకపోవడానికి వైసీపీ నేతలు కూడా వారిని విమర్శించడం లేదు కదా అని గుర్తు చేస్తున్నారు. వైసీపీ ఒక్కసారి విమర్శించి చూస్తే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో బీజేపీ పెద్దలు స్ట్రాంగ్ గానే రుచి చూపిస్తారు అని అంటున్నారు.