ఇండియాలో ఇండైరెక్ట్ గా షట్ డౌన్ !
కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా దేశాన్ని షట్ డౌన్ దిశగా నడిపిస్తోందా అన్న చర్చ మొదలైంది.
By: Satya P | 12 May 2026 8:30 AM ISTకేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా దేశాన్ని షట్ డౌన్ దిశగా నడిపిస్తోందా అన్న చర్చ మొదలైంది. ఇన్ డైరెక్ట్ గా దేశం షట్ డౌన్ అవుతోందా, దేశంలో క్రియాశీల కార్యకలాపాలు నెమ్మదిగా బాహాటం నుంచి తెర వెనక్కి పోతున్నాయా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. దానికి దేశాన్ని ఏలుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గత రెండు రోజులుగా ఇస్తున్న బలమైన సంకేతాలే నిదర్శనంగా చెబుతున్నారు. నరేంద్ర మోడీ ఏం మాట్లాడినా ఆయన దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట కూడా అధికారికంగానే చూడాల్సి ఉంటుంది. అది ఒక శాసనం గానే భావించాల్సి ఉంటుంది.
బలమైన సంకేతాలుగానే :
ఇక నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో చెప్పింది చూస్తే బంగారం కొనొద్దు, విదేశీ పర్యటన చేయొద్దు, వంట నూనెలు వాడకం తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించండి, విహార యాత్రలు మానుకోండి, అంతేకాకుండా ప్రజా రవణాని ప్రోత్సహించండి ఇవన్నీ చెప్పారు దాని కొనసాగింపు అన్నట్లుగా తాజాగా ఆయన గుజరాత్ పర్యటనలో కీలకమైన మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే దేశంలోని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని కోరారు. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఛారిటీ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులకు షిఫ్ట్ అవ్వాలని ప్రధాని స్వయంగా సూచించారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇక దేశంలోని కంపెనీలు వర్క్ ఫ్రం హోం కి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతూనే ఈ కీలకమైన సూచనలు చేశారు. గుజరాత్ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ మరోసారి బంగారం కొనుగోలును తగ్గించుకోవాలని దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలను కోరారు.
కరోనా నాటి సన్నివేశాలు :
ప్రధాని ఈ విధంగా ఇచ్చిన ప్రకటనలు చూస్తూంటే గతంలో అంటే దాదాపు అయిదారేళ్ళ క్రితం సంభవించిన కరోనా లాంటి పెను విపత్తుల సమయంలో ఏర్పడిన సన్నివేశాలు మళ్లీ చూస్తామా అన్న చర్చ మొదలైంది. వర్క్ ఫ్రం హోం లాంటి కార్యకలాపాలు కానీ ఆన్ లైన్ లో చదువులు లాంటివి కానీ మళ్ళీ సంభవిస్తాయా అంటే ఇవన్నీ జరిగే సూచనలుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రకంగా ప్రధానమంత్రి చేస్తున్న వరుస ప్రకటనలు చూస్తే ఒక విషయం అర్థం అవుతోంది. దేశం నెమ్మదిగా షట్ డౌన్ దిశగా సాగుతోంది అన్నదే అర్థమవుతోంది. కరోనా వైరస్ సమయంలో మాదిరిగానే మెల్లగా కార్యకలాపాలను బాహటం నుంచి తెర వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే దీని మీద చాలా లోతైన విశ్లేషణ కూడా ఈ సందర్భంగా చేయాల్సి ఉంది.
ఆర్థిక మాధ్యం దిశగా :
గల్ఫ్ యుద్ధం ప్రభావంతో ముడి చమురు లభ్యం కావడం లేదు. దాంతో పెట్రోల్ డీజిల్ అంటివి తగ్గించాలని చెప్తున్నారు అయితే ఇప్పుడు వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ తరగతులు అంటున్నారు, బంగారం కొనొద్దు అని కూడా మోడీ చెబుతున్నారు ఇవన్నీ చూస్తూంటే సరికొత్త సందేహాలు కూడా వస్తున్నాయి. దేశం ఆర్థిక మాంద్యం దిశగా ఏమైనా వెళ్తోందా అన్నదే ఆ చర్చ. గల్ఫ్ యుద్ధం పర్యవసనాలు ఏమిటి అంటే ఇన్నాళ్లు ఫ్రీగా ఉన్న హార్మోజ్ జల సంధి ఇప్పుడు ఆంక్షలతో నిండిపోయింది. దాంతో గతంలో మాదిరిగా ఇపుడు ముడి చమురుతో నౌకలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు దాంతో పాటు అమెరికా ఇరాన్ ఈ దేశాల మధ్య యుద్ధం ఊఒర్తిగా ఆగుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి ఈ విధంగా ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.
వర్క్ ఫ్రం హోం వద్దు :
ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున ప్రపంచమంతా ఎక్కడ చూసినా వర్క్ ఫ్రం హోం వద్దని అంటున్నారు. కానీ దానికి భిన్నంగా రివర్స్ లో భారత దేశంలో దేశంలో ఆన్ లైన్ తరగతులు వర్క్ ఫ్రం హోం అంటున్నారు. అంటే ఎలా ఇది సాధ్యపడుతుంది, ఏమిటి మోడీ మాటలు వెనకాల అర్థాలు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
మోడీ వైఫల్యాలు :
ఇవనీ మోడీ పాలన వైఫల్యాలు అని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నారు. గత పన్నెండేళ్ళ పాలన తరువత దేశ ప్రజలు ఏమి తినాలి ఏమి కొనాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పాల్సి వస్తోందని ఆయన మోడీ పాలనను ఎండగట్టారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు మోడీ ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారు అని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
