Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ‌.. గిరిజ‌నుల‌కు 3 వేల కోట్ల ప్రాజెక్టులు!

బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గిరిజనుల అభివృద్ధి కోసం రూ.3 వేల కోట్ల విలువైన 246 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 38 ఏకలవ్య మోడల్ పాఠశాలలు, 100 బహుళ ప్రయోజన కేంద్రాలను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గిరిజన ఓటు బ్యాంకును లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Garuda Media   |   16 Nov 2026 2:05 AM IST
ఎన్నిక‌ల వేళ‌.. గిరిజ‌నుల‌కు 3 వేల కోట్ల ప్రాజెక్టులు!
X

కీల‌క‌మైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గిరిజ‌నుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ఆదివారం ఆదివాసీ ఆరాధ్య‌దైవం బిర్సాముండా 151వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆయా ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. ఏక‌ల‌వ్య(గిరిజ‌నుల‌కు కేటాయించిన విద్యాల‌యాలు) విద్యాసంస్థ‌ల అభివృద్దితోపాటు.. గిరిజ‌న ప్రాంతాల్లో ర‌హ‌దారులు, ఇత‌ర ప్రాజెక్టుల నిర్మాణం కూడా వీటిలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

గిరిజనుల అభివృద్ధి కోసం 3,000 కోట్ల రూపాయ‌ల‌ విలువైన 246 ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 173 ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కింద గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మరియు విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకలవ్య పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థుల నాణ్యమైన విద్య కోసం దేశవ్యాప్తంగా 38 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించారు.

పీఎం-జన్‌మ‌న్ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో 100 బహుళ ప్రయోజన కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. 'ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్' కింద గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించారు. త‌ద్వారా ఆయా ప్రాంతాల్లో ర‌హ‌దారుల నిర్మాణం, తాగునీటి సౌక‌ర్యం, నివాస ప్రాంతాల్లో విద్యుత్ సౌక‌ర్యం వంటివి ఏర్పాటు చేయ‌నున్నారు. త‌ద్వారా.. గిరిజ‌న ప్రాంతాల‌ను మ‌రింత అభివృద్ధి చేయ‌నున్నారు.

ల‌క్ష్యం ఒక్క‌టే..

3 వేల కోట్ల రూపాయ‌ల‌తో ప్రాజెక్టులు ప్రారంభించి.. గిరిజ‌నుల‌కు మేలు చేయ‌డం మంచిదే అయినా.. ఆయా ప్రాజెక్టుల స్వ‌రూపం.. వాటి ల‌క్ష్యం చూస్తే.. ఒక్క‌టే క‌నిపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌య‌మే ల‌క్ష్యంగా ఆయా ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగుతాయి. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. గిరిజ‌న ఓటు బ్యాంకు ల‌క్ష్యంగానే అడుగులు వేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.