Begin typing your search above and press return to search.

అధ్యయనంలో షాకింగ్ నిజాలు.. అలాంటి అమ్మాయిలకే ప్రాధాన్యత.. మరి మీ సంగతేంటి?

పెళ్లి అంటే ఏడడుగులు.. మూడు ముళ్ళు.. ఇద్దరు వ్యక్తుల కలయిక అన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   13 Feb 2026 11:00 PM IST
అధ్యయనంలో షాకింగ్ నిజాలు.. అలాంటి అమ్మాయిలకే ప్రాధాన్యత.. మరి మీ సంగతేంటి?
X

పెళ్లి అంటే ఏడడుగులు.. మూడు ముళ్ళు.. ఇద్దరు వ్యక్తుల కలయిక అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడితో ఆగిపోలేదు.. ఆజన్మాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ.. సప్తపది అడుగుల్లో ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటూ జీవితాంతం తోడుగా ఉంటామని.. మనసా వాచా కర్మణా పాటిస్తామని వాగ్దానం చేస్తారు. అయితే ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలే జరిగేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో అభిరుచులు మారుతున్నాయి. కాబట్టి తమకు నచ్చిన వ్యక్తిని ఏరి కోరి మరీ వివాహం చేసుకుంటున్నారు.

అలా ఇష్టపడి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న జంటలు జీవితాంతం సఖ్యతగా కొనసాగుతున్నాయా అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.కొంతమంది చిన్న చిన్న గొడవలకే విడిపోతే.. మరికొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతున్నారు. ఇంకొంతమంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ తద్వారా గొడవలు పెరిగి విడిపోతున్నారు. ఇకపోతే మరికొంతమంది.. "ఐడియల్ జంటలు ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు.అందుకే మాకు వివాహంపై నమ్మకం లేదు" అనే వ్యక్తులు కూడా లేకపోలేదు .

మరొకవైపు వివాహం చేసుకోబోయే వారిలో అటు అమ్మాయి అయినా ఇటు అబ్బాయి అయినా ఫలానా లక్షణాలు ఉండాలి అని కోరుకునే వారి సంఖ్య కూడా ఈ మధ్య ఎక్కువైపోయింది. అందులో భాగంగానే సాధారణంగా ఎలాంటి అబ్బాయి కావాలి అనే విషయంలో అమ్మాయిలు తమ అభిప్రాయాలను చెప్పేవారు. కానీ తాజాగా వెలువడిన అధ్యయనంలో అలాంటి లక్షణాలున్న అమ్మాయిలే తమకు భార్యగా రావాలని అబ్బాయిలు కోరుకుంటున్నారట. మరి అబ్బాయిలు కోరుకుంటున్నట్టు అమ్మాయిలూ మీలో ఆ లక్షణాలు ఉన్నాయా? అసలు అధ్యయనం ఏం చెబుతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఒకప్పుడు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరడం అన్నది నానుడి. కానీ నేటి యువత జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంట. పదేళ్ల క్రితం పెళ్లి సగటు వయసు 27 ఉండగా ఇప్పుడిది 29కి మారింది. జీవన్ సాథీ సంస్థ 2016 నుండి 2025 వరకు చేసిన అధ్యయనంలో ఇది వెల్లడయ్యింది. ముఖ్యంగా కులం పట్టింపు లేదు. డివోర్డ్స్ , భాగస్వామి మరణం తర్వాత రెండో పెళ్లి చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇక ప్రస్తుత ఆధునిక జీవితంలో కాబోయే భార్య సంపాదన పరురాలై ఉండాలని, సుమారుగా 87% మంది అబ్బాయిలు కోరుకుంటున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.

మొత్తానికైతే సంపాదించే అమ్మాయి భాగస్వామిగా వస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవనే అభిప్రాయానికి అబ్బాయిలు వస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా కాలం మారుతున్న కొద్ది అభిరుచులు కూడా కూడా మారిపోతున్నాయి. ఆధునిక ప్రపంచంలో ఖర్చులు భరించాలి అంటే ఒకరే కుటుంబాన్ని పోషించడం సాధ్యమైన పని కాదు. అటు అమ్మాయిలు కూడా సంపాదించి, ఆర్థికంగా స్వతంత్రపరులు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటేనే వివాహానికి సిద్ధం అంటూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా కాలానికి తగ్గట్టుగా ఆలోచనల్లో మార్పు మంచికే అని మరోసారి నిరూపిస్తున్నారు.