Begin typing your search above and press return to search.

జాగ్రత్త.. అలాంటి ఫోటోలు మీ గ్యాలరీలో ఉన్నాయా?

ఫోటో భవిష్యత్తు తరాలకు మన ఆధారాలను చూపే ఒక తీపి గుర్తు.. పూర్వకాలంలో ఫోటోలు అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఎక్కడో ఒక పట్టణ కేంద్రంలో మాత్రమే దింపేవారు.

By:  Madhu Reddy   |   4 Sept 2025 1:00 PM IST
జాగ్రత్త.. అలాంటి ఫోటోలు మీ గ్యాలరీలో ఉన్నాయా?
X

ఫోటో భవిష్యత్తు తరాలకు మన ఆధారాలను చూపే ఒక తీపి గుర్తు.. పూర్వకాలంలో ఫోటోలు అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఎక్కడో ఒక పట్టణ కేంద్రంలో మాత్రమే దింపేవారు. అలా మన తాతలు, తండ్రులు ఏదో ఒక పెళ్లిలో, లేదంటే ఏదైనా ఫంక్షన్ లో ఒక ఫోటో దిగితే ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకునేవారు. అలా ఒక్క ఫోటోని చూసుకుంటూ వారి జీవితకాలం మురిసేవారు. వారి ప్రతిరూపం ఒక కాగితంపై ముద్రించబడింది అంటే అది చాలా ఆనందాన్ని ఇచ్చేది. అలాంటి ఫోటోకు ప్రస్తుతం వ్యాల్యూ లేకుండా పోయింది.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. తుమ్మినా, దగ్గినా, తిన్నా ఇంకా ఏ పని చేసినా ఫోటోలు తీసుకుంటున్నారు.

అయితే ప్రతి ఒక్కరు మొబైల్ లో తీసేటువంటి ఏ ఫోటో అయినా సరే వారి ఫోన్ లోని గ్యాలరీలో సేవ్ అవుతూ ఉంటుంది. మరి ఇలా గ్యాలరీలో సేవ్ అవడం మంచిదేనా.. దీనివల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేదానిపై చాలామందికి అనుమానం ఉంటుంది.. ఫోటో గ్యాలరీలో సేవ్ అవ్వడం అనేది ఇబ్బందే నట. దీనివల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఆ ఇబ్బందులు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం చాలామంది వారి ఫోటోలు వివిధ రూపాలలో దిగుతూ ఉంటారు. కొంతమంది కామన్ ఫోటోలు కాకుండా ప్రైవేట్ గా ఉన్నటువంటి ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు. ఇవన్నీ వారి ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతాయి. అలాంటి తరుణంలో మనం ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకునే కొన్ని యాప్స్ గ్యాలరీ యాక్సెస్ కూడా అడుగుతుంది. దీనివల్ల మన గ్యాలరీ అనేది వారి చేతిలోకి వెళ్తుందని అంటున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ఫోటోలను కూడా మనం తీసి జాగ్రత్త చేసుకుంటూ ఉంటాం. దీని ద్వారా కూడా కొంతమంది సైబర్ నేరగాళ్లు మన డేటాని చోరీ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ తెలియజేస్తున్నారు. అలాంటి సమయంలో మనం ప్రైవేటుగా దిగిన ఫోటోలైన సరే, మనకు సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇతర ఏ వివరాలనైనా సరే గ్యాలరీలో సేవ్ చేసుకోకపోవడం మంచిది కాదని తెలియజేస్తున్నారు.

ముఖ్యమైన ఫోటోలు, సమాచారాన్ని గ్యాలరీలో కాకుండా డిజీ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలియజేశారు. అయితే బుధవారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి హ్యాక్ ప్రూఫ్ సదస్సులో ఈయన పాల్గొని ఈ విషయాలు చెప్పారు. మన మొబైల్ లోకి కొన్ని యాప్ లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో మొబైల్ గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటుందని, దీనివల్ల పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర ప్రైవేట్ ఫోటోలు కూడా వారికి వెళ్ళిపోయే అవకాశం ఉందని అన్నారు.

వీటిల్లో అన్నింటికీ ఒకే పాస్ వర్డ్ పెట్టుకోకూడదని, మనం పెట్టే పాస్ వర్డ్ కూడా చాలా బలంగా ఉండాలని , దాన్ని ఎప్పటికప్పుడు మార్పు చేయాలని సూచించారు. అలాగే మల్టీ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఆన్ చేసుకోవాలని తెలియజేశారు. సైబర్ సెక్యూరిటీపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆన్లైన్లో ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగించే ఫోన్ నెంబర్లకు ఇన్ కమింగ్ సేవలు ఉండవని, కొత్త నెంబర్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని తెలియజేశారు.