Begin typing your search above and press return to search.

హుక్కా అంటే ఏంటో తెలియదు.. పార్టీపై దివ్వెల మాధురి క్లారిటీ

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేయసి దివ్వెల మాధురి మొయినాబాద్ లో అనుమతి లేని మందు పార్టీ ఇచ్చారంటూ శుక్రవారం ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

By:  Tupaki Political Desk   |   12 Dec 2025 1:38 PM IST
హుక్కా అంటే ఏంటో తెలియదు.. పార్టీపై దివ్వెల మాధురి క్లారిటీ
X

హైదరాబాద్ శివార్లలోని గురువారం రాత్రి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన మందు పార్టీపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేయసి దివ్వెల మాధురి క్లారిటీ ఇచ్చారు. అనుమతి లేకుండా మద్యం, హుక్కా వినియోగించారనే ఆరోపణలపై వివరణ ఇచ్చిన దివ్వెల మాధురి.. తనకు హుడ్కా అంటే ఏంటో తెలియదని చెప్పారు. అంతేకాకుండా టీవీ చానళ్లలో ప్రచారం జరుగుతున్నట్లు తమను పోలీసులు అరెస్టు చేయలేదని, తమ ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించారు. బిజినెస్ మీట్ అంటూ స్నేహితులు పిలవడంతోనే తాము పార్టీకి వెళ్లామని, మీడియాలో ప్రచారం జరుగుతున్న తన పుట్టిన రోజు పార్టీ కాదని మాధురి వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేయసి దివ్వెల మాధురి మొయినాబాద్ లో అనుమతి లేని మందు పార్టీ ఇచ్చారంటూ శుక్రవారం ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. పార్టీలో దువ్వాడ స్నేహితులు నృత్యాలు చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పది బాటిళ్ల విదేశీ మద్యం, హుడ్కా సాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ జంటపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వారిని పోలీసులు అరెస్టు చేశారని కూడా కొందరు పోస్టులు చేశారు.

అయితే మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తమను పోలీసులు అరెస్టు చేయలేదని ఎమ్మెల్సీ దువ్వాడ స్పష్టం చేశారు. తన స్నేహితుడు పార్థసారథి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని, ఆయన ఆహ్వానం మేరకు తాము వెళ్లామని దువ్వాడ తెలిపారు. కాగా, ఏపీలోని టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదాలతో ప్రియురాలు మాధురితో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. నగరంలోని వస్త్ర వ్యాపారం చేస్తున్న ఈ జంట కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ పెయిర్ గా నిలుస్తూ వస్తున్నారు.

దువ్వాడ ప్రజాప్రతినిధిగా ఉంటున్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న ప్రతి అంశాన్ని సోషల్, డిజిటల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రధానంగా 60 ఏళ్ల వయసులో ఆయన ప్రేమలో పడటం, మాధురితో కలిసి హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నట్లు బహిరంగంగా చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించినా, అవేవీ పట్టించుకోకుండా తాము తప్పు చేయలేదని నిజాయితీగా ఉంటున్నామని చెప్పుకుంటున్నారు. దీంతో ఆ ఇద్దరిపై సోషల్ మీడియా అటెన్షన్ ఎక్కువైందని అంటున్నారు.