ఎమ్మెల్యేలను ఇరికించేస్తున్న అధికారులు ..!
కొత్త పింఛన్లు: ప్రస్తుతం కొత్త పింఛన్ల కోసం.. ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న జనాలు పెరుగుతున్నా రు.
By: Garuda Media | 22 Aug 2025 8:00 PM ISTఅధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా విషయాల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు.. ఎమ్మెల్యేలకు ఇబ్బందికర వాతావర ణం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా మూడు విషయాలు ఎమ్మెల్యేలకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నా యి. అయితే.. ఇది ప్రభుత్వమే తీసుకుంటున్న నిర్ణయంగా వారు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మాత్రం ఎమ్మెల్యేలకు సెగ తగులుతోంది. దీంతో వారు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.
1) కొత్త పింఛన్లు: ప్రస్తుతం కొత్త పింఛన్ల కోసం.. ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న జనాలు పెరుగుతున్నా రు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న దరిమిలా.. ఇప్పటి వరకు ఒక్కటి కూడా కొత్త పింఛను రాయలేదు. అలాగని లబ్ధిదారులు లేరా? అంటే.. ఉన్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా అందుతు న్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని.. అధికారులకు ఎమ్మెల్యేలు చెబుతున్నా.. ఎవరూ వినిపించుకోవ డం లేదు. దీంతో లబ్ధిదారులుగా తమకు అర్హత ఉందని చెబుతున్న ప్రజలు.. ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సర్దిచెప్పలేక నేతలు సతమతం అవుతున్నారు.
2) రేషన్ కార్డులు: కొత్త రేషన్ కార్డుల వ్యవహారం కూడా ఎమ్మెల్యేలకు చిక్కులు తెస్తున్నాయి. తమకు రేష న్ కార్డులు కావాలంటూ.. ఎమ్మెల్యేలకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా పరిస్థితి నెలకొంది. కానీ, అధికారులు మాత్రం తమ చేతిలో లేదని.. చెబుతున్నారు. వీరికి సర్ది చెప్పలేక, ప్రజలను బుజ్జగించలేక ఎమ్మెల్యేలు తిప్పలు పడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ల పరిస్థితి ఇబ్బందిగానే ఉంది.
3) నిధుల విడుదల: గత ప్రభుత్వంలోను, ఇప్పుడు కూడా.. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నుంచి రూపాయి రావడం లేదు. నియోజకవర్గంలో పనులు చేయించాలంటే.. ఒకప్పుడు ఎమ్మెల్యేలు దగ్గరుండి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది. వైసీపీ హయాంలో అసలు సొమ్ములే ఇవ్వలేదు. ఇప్పుడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు అప్పగించారు. కలెక్టర్ ఒప్పుకొంటే తప్ప.. పనులు జరగవు.
అవి కూడా.. కలెక్టర్లు చూసి. నిర్ణయించి.. అంచనాలు వేసుకుంటేనే పనులు చేస్తున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారు. తాము చెబుతున్న పనులు.. ఇప్పుడు అవసరం లేదంటూ.. కలెక్టర్లు పక్కన పెట్టేస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో పనులు జరగక ఇబ్బందులు వస్తున్నాయి. ఇలా.. ఎమ్మెల్యేలు అధికారుల కారణంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం.
