Begin typing your search above and press return to search.

ఇరువురు నేత‌ల కౌగిలిలో.. నియోజ‌క‌వ‌ర్గం తిప్ప‌లు.. !

స‌త్య‌వేడు: తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య పోరు తార‌స్థాయికి చేరింది. దీంతో అధికారులు ఎవరి మాట వినాలో అర్థం కాక ఇబ్బందులు ప‌డుతున్నారు.

By:  Garuda Media   |   22 Jan 2026 5:00 AM IST
ఇరువురు నేత‌ల కౌగిలిలో.. నియోజ‌క‌వ‌ర్గం తిప్ప‌లు.. !
X

కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు.. ఇద్ద‌రు నేతల ఆధిప‌త్యం మ‌ధ్య న‌లుగుతున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కాదు కానీ... కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు మాత్రం ఇలానే ఉన్నాయి. వీటిలో ఎక్క‌వ‌గా త‌క్కువ ఏమీ క‌నిపించ‌డం లేదు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్య పోరు.. కార‌ణంగా జ‌రుగుతుండ‌గా.. మ‌రికొన్ని చోట్ల‌.. నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడుతున్నార‌న్న వాద‌న‌తో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు..

తిరువూరు: రాష్ట్రంలో డ‌బుల్ అథారిటీ సాగుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌స్ట్ నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఇక్కడ ఎమ్మెల్యేకు.. ఎంపీకి మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు మారి పోయాయి. ఎమ్మెల్యే త‌న‌దైన శైలిలో అధికారుల‌ను ఆదేశిస్తున్నారు. కానీ, ఎంపీ వీటిని అడ్డుకుంటున్నా రు. ఫ‌లితంగా నియోజ‌క‌వ‌ర్గంలో అధికారులు ఎవ‌రి మాట వినాలో అర్థం కాక‌.. ఇబ్బందులు ప‌డుతున్నా రు. ప‌నులు కూడా నిలిచిపోతున్నాయి.

స‌త్య‌వేడు: తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య పోరు తార‌స్థాయికి చేరింది. దీంతో అధికారులు ఎవరి మాట వినాలో అర్థం కాక ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుత ఎమ్మెల్యేను పార్టీ దాదాపు దూరం పెట్టింది. ఆయ‌న నామ్‌కే వాస్తే.. అన్న‌ట్టుగా ఉన్నారు. ఆయ‌న పై లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌కి ఫుల్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో ఎవ‌రికివారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు న‌లుగుతున్నారు.

నెల్లిమ‌ర్ల‌: ఇక్క‌డ జ‌న‌సేన మ‌హిళా నేత విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఇక్క‌డ కూడా ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. టీడీపీ నాయ‌కులు ఒక దారిలో ఉంటే.. ఎమ్మెల్యే మ‌రోదారిలో ఉన్నారు. దీంతో అధికారు లు ఎవ‌రి మాట వినాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ప‌నులు నిలిచిపోతున్నాయి.

గుంటూరు: గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి కొన‌సాగుతోంది. ఎమ్మెల్యే త‌మ మాట వినిపించుకోవ‌డం లేద‌ని.. సొంత పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. దీంతో వారే స్వ‌యంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, త‌మ అనుమ‌తి లేకుండా.. ఇటు పుల్ల అటు పెట్టొద్ద‌ని అధికారుల‌కు ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు. దీంతో ఆధిప‌త్య రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఫ‌లితంగా నాయ‌కుల మ‌ధ్య అధికారులు న‌లిగిపోతున్నారు.