ఏపీ ఎమ్మెల్యేల తప్పులు - తిప్పల వెనుక.. రీజన్లు ఇవే...!
ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. వీటి కారణంగానే.. ఎమ్మెల్యేలు తప్పులపై తప్పులు చేస్తున్నారన్నది ప్రధాన చర్చ.
By: Garuda Media | 22 Aug 2025 2:00 PM ISTఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు. తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం గా చర్చ కూడా నడుస్తోంది. ఎక్కడో ఒక చోట.. ఎమ్మెల్యేలు దొరుకుతూనే ఉన్నారు. మరి దీనికి కారణాలేం టి? అనేది కూడా ఇంపార్టెంటే. పైకి జరుగుతున్న తప్పులను చూస్తున్నప్పటికీ వీటికి వెనుక చాలా కార ణాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. వీటి కారణంగానే.. ఎమ్మెల్యేలు తప్పులపై తప్పులు చేస్తున్నారన్నది ప్రధాన చర్చ.
1) నియోజకవర్గంపై పై చేయి: నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరున్నా.. తనదే పైచేయి అనుకునేలా వ్యవ హరిస్తారు. తనపెత్తనం సాగాలనే కోరుకుంటారు. ఇది తప్పుకాదు. అయితే.. గతంలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. అయితే.. అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. అప్పట్లో పథకాలను విస్తృ తంగా ఇచ్చిన కారణంగా.. వలంటీర్లు ప్రజల్లో తిరిగిన కారణంగా కూడా.. నాయకులు ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎన్నికల సమయం వరకు వేచి ఉన్నారు. కానీ.. ఇప్పుడు అలా లేదు. అందుకే.. నియోజకవర్గంపై పైచేయి కోసం.. ప్రయత్నిస్తున్నారు.
2) రాజకీయ పోటీ: రాజకీయాల్లో పోటీ ఎప్పుడూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఇది మరింత పెరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు రావడం.. ప్రతి విషయంలోనూ పోటీ పెరగడంతో నాయకు లు తర్జన భర్జన పడుతున్నారు. సోషల్ మీడియా హవా పెరిగిపోయిన దరిమిలా.. ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే ఏ పనిచేస్తున్నాడు? ఎక్కడున్నాడు? వంటి విషయాలను ఇట్టే తెలుసుకుంటున్నారు. ఇది సహజంగానే ఎమ్మెల్యేలపై ఒత్తిడిని పెంచుతోంది. ఇది కూడా నాయకులను దూకుడుగా వ్యవహరించేలా చేస్తోంది.
3) వచ్చే ఎన్నికలు: ఇక, వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే పుంజుకుంది. పార్టీల మధ్య నెలకొన్న పోటీ.. మరింత ఎక్కువగా ఉంది. పైగా.. టికెట్ దక్కించుకోవడం అనే ప్రాతిపదిక ఒకప్పుడు పనితీరు ఆధారంగా ఉంటే.. ఇప్పుడు.. సొమ్ముల ఆధారంగా మారిపోయింది. ఎంత ఎక్కువ ఖర్చు చేయగలిగితే.. అంత ఎక్కువ సానుభూతిని సొంతం చేసుకునే పరిస్థితి ఉంటోంది. ఈనేపథ్యం లోనే నాయకులు.. సంపాదనపై దృష్టి పెడుతున్నారన్నది ప్రధాన కారణం. వీటిని సరిచేసుకుంటే.. అందరూ మంచి ఎమ్మెల్యేలుగానే పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
