Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్?

ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఒక పరిణామం తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. పలువురు జర్నలిస్టులకు ఆందోళనకు గురి చేశాయి.

By:  Garuda Media   |   24 Nov 2025 9:36 AM IST
తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్?
X

ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఒక పరిణామం తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. పలువురు జర్నలిస్టులకు ఆందోళనకు గురి చేశాయి. దీనికి కారణం.. మంత్రులు పలువురితో జర్నలిస్టులతో ఉన్న వాట్సాప్ గ్రూపులు హ్యాక్ కావటమే దీనికి కారణం. భారతీయ స్టేట్ బ్యాంక్.. ఆధార్ అప్డేట్ పేరుతో పలువురి వాట్సాప్ గ్రూపులు హ్యాక్ కు గురయ్యాయి. ఇందులో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ఉండి.. అప్డేట్ కోసం ఆ ఫైళ్లను డౌన్ లోడ్ చేయాలని కోరారు.

అనూహ్య రీతిలో చోటు చేసుకున్న ఈ తీరు రాజకీయ.. జర్నలిస్టు సర్కిళ్లకు షాకింగ్ గా మారాయి. అయితే.. ఏపీకే ఫైళ్ల కు సంబంధించి అవగాహన ఎక్కువగా ఉండటంతో కీలక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయినట్లుగా గుర్తించారు. వెంటనే.. ఆయా శాఖల మంత్రుల సిబ్బంది అప్రమత్తమై.. తాము ఏర్పాటు చేసిన గ్రూపుల్లోని పలువురు కీలక సభ్యులకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ.. ఆ లింకుల్ని టచ్ చేయొద్దని.. వీలైనంత వరకు ఆ ఫైళ్లను ఫోన్ల నుంచి తొలగించమని.. అవసరమైతే సదరు వాట్సాప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చేయాలని సమాచారం అందించారు.

దీంతో.. పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. దీనికి తోడు వాట్సాప్ గ్రూపు పేరు కూడా మారిపోవటం.. అప్పటివరకు ఉన్న గ్రూపు పేరుకు బదులుగా ఎస్ బీఐ అంటూ బ్లూ టిక్ మార్క్ తో ఉండటంతో కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి. మరోగ్రూపులో ఆధార్ అప్డేట్ అన్న పేరుతో వాట్సాప్ గ్రూపు పేరు సైతం మారిపోయింది. ఈ రెండు వ్యవహారాలు కలకలాన్ని రేపాయి. తెలంగాణ మంత్రులు నిర్వహించే వాట్సాప్ గ్రూపులు ఇలా హ్యాక్ కావటం సంచలనంగా మారింది.

ఇంతకూ తెలంగాణ మంత్రులకు చెందిన వాట్సాప్ గ్రూపులు ఏ రీతిలో హ్యాక్ అయ్యాయి? అన్న విషయానికి వస్తే.. గ్రూపుల్లోని సభ్యుల పొరపాట్లతో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అలాంటి వారిని గుర్తించాలని.. తొందరపాటు తో డౌన్ లోడ్ కు నొక్కితే.. ఆ వెంటనే ఫోన్ హ్యాక్ కావటంతో పాటు.. నిమిషాల వ్యవధిలోనే ఫోన్ కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలు మొత్తం జీరోకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా.. ఫోన్ కు వచ్చే ఏపీకే ఫైళ్లను అత్యంత జాగ్రత్తగా వాటిని డీల్ చేయాల్సిన అవసరం లేదు. సింఫుల్ గా డిలీట్ చేయటానికి మించిన మంచి పని మరేమీ ఉండదని మాత్రం చెప్పక తప్పదు.