Begin typing your search above and press return to search.

బాలు పాట కోసం ఎంజీఆర్ షూటింగ్ క్యాన్సిల్

అదే 1969లో బ్లాక్‌బస్టర్ అయిన ఆదిమై పెన్న్చిత్రం సినిమా. అందులో ఎంజీఅర్ కి తొలిసారిగా ఎస్పీ బాలు ఆయిరం నిలవే వా అన్న పాట పాడారు.

By:  Satya P   |   23 Feb 2026 9:26 AM IST
బాలు పాట కోసం ఎంజీఆర్ షూటింగ్ క్యాన్సిల్
X

తమిళ ప్రజల వెండితెర వేలుపుగా ఎంజీఆర్ వెలుగొందారు. ఆయన సూపర్ స్టార్ డం వర్ణించనలవి కాదు, ఆయన ప్రజలకు దేవుడుగా నిలిచారు. ఆయన రాజకీయాల్లోనూ అదే రికార్డు సాధించారు. 1985లో ఆయన మూడవసారి అన్నా డీఎంకే తరఫున తన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలో వైద్యం తీసుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు, కానీ కేవలం ఎంజీఅర్ బొమ్మను చూసి జనాలు భారీ మెజారిటీతో ఆ పార్టీని గెలిపించారు అంటే దటీజ్ ఎంజీఆర్ అని చెప్పాల్సి ఉంది.

బాలు పాట విని :

ఇక తమిళనాడులో 1960, 1970 దశకంలో ఎంజీఅర్ అగ్ర శ్రేణి నటుడిగా వెలుగొందుతున్నారు. ఆయన ఇక సినిమా షూటింగ్ కోసం ఒక స్టూడియో వద్ద ఉన్నారు. షాట్ గ్యాప్ లో ఆయన ఉంటే ఆ స్టూడియో రికార్డింగ్ ధియేటర్ నుంచి ఒక పాట వినిపించింది. అది విని ముగ్దుడైన ఎంజీఆర్ ఎవరిది ఆ పాట ఎవరా గాయకుడు అని కనుక్కోమని తన అసిస్టెంట్లను పంపించారు. వారు వెళ్ళి వచ్చి ఎస్పీ బాలు అనే యువ తెలుగు గాయకుడి పాట అని చెప్పారు. అంతే ఆ తరువాత బాలు ఇంటికే తన వారితో కారు పంపించి తన కొత్త సినిమాలో ఆయనను నేపధ్య గాయకుడిగా ఎంజీఆర్ ఎంపిక చేశారు.

బ్లాక్ బస్టర్ మూవీ :

అదే 1969లో బ్లాక్‌బస్టర్ అయిన ఆదిమై పెన్న్చిత్రం సినిమా. అందులో ఎంజీఅర్ కి తొలిసారిగా ఎస్పీ బాలు ఆయిరం నిలవే వా అన్న పాట పాడారు. అప్పటికి తమిళంలో కేవలం ఒకటి రెండు పాటలు మాత్రమే పాడిన బాలు వర్ధమాన గాయకుడిగా ఉండగానే ఎంజీఆర్ ఈ అవకాశం ఇచ్చారు. అప్పటిదాక ఎంజీఆర్ కి ప్రముఖ తమిళ నేపధ్య గాయకుడు టిఎం సౌందరరాజన్ పాడేవారు. అయితే వారిద్దరిమధ్య ఏర్పడిన అపార్థం ఏర్పడడం కూడా కొత్త వారిని ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడింది అని చెబుతారు.

బాలూ పట్ల అభిమానం :

అయితే ఈ పాటను బాలు చేత పాడించాలని పలు రిహాల్సల్స్ చేయించిన ఎంజీఅర్ వారంలో రికార్డింగ్ పెట్టుకున్నారు. ఆ సమయంలో బాలుకి టైఫాయిడ్ జ్వరం రావడం ఏకంగా మూడు వారాల పాటు ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. బాలు పాట రికార్డింగ్ అయితే ఆ వెంటనే జైపూర్ లో ఆ డ్యూయెట్ ని తీయాలని అంతా ప్లాన్ చేసుకున్న ఎంజీఆర్ కి బాలు జ్వరం కారణంగా రికార్డింగ్ కి రాకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారుట. బాలు తిరిగి కోలుకున్నాకనే ఆయనతో ఆ పాట పాడించి మరీ జైపూర్ లో షూట్ చేశారు.

కెరీర్ కి ఇబ్బంది అవుతుందని :

ఈ పాటను సుశీలతో కలసి బాలు పాడారు ఇదిలా ఉంటే తన లాంటి వర్ధమాన గాయకుడి పట్ల ఎంజీఆర్ చూపించిన అభిమానం ఇది అని బాలు అనేక సందర్భాలలో చెప్పారు. లక్షల వ్యయంతో జరిగే షూటింగ్ ని క్యాన్సిల్ చేయడం అంటే మాటలు కాదని అన్నారు. అయితే బాలు లాంటి అప్ కమింగ్ సింగర్ కి మాట ఇచ్చి పాటను వేరే వారితో పాడిస్తే ఆయన సినీ కెరీర్ కి ఇబ్బంది అవుతుందని భావించే ఎంజీఅర్ ఎంతో ఉదారతతో తన సినిమా షూటింగ్ నే వాయిదా వేసుకున్నారు. ట. ఆ విషయాన్ని స్వయంగా ఎంజీఆర్ నే బాలుతో చెప్పారు. ఎంజీఅర్ లాంటి గొప్పవారి ప్రోత్సాహం వల్లనే తాను ఎదిగాను అని అనేక సందర్భాలలో బాలుచెప్పారు. అంతే కాదు వారి పట్ల తన కృతజ్ఞతను కూడా చాటుకున్నారు.