Begin typing your search above and press return to search.

మెటాకు భారీ నష్టం... ఇవేనా అసలు కారణాలు!

అవును... మెటా సంస్థ గత నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను నమోదు చేసిందనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Raja Ch   |   9 Dec 2025 3:34 PM IST
మెటాకు భారీ నష్టం... ఇవేనా అసలు కారణాలు!
X

మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మెటావర్స్ గత నాలుగు సంవత్సరాలలో 70 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను నమోదు చేసింది. ఈ విషయం కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారడంతోపాటు త్వరలో లేఆఫ్ లు తప్పవా అనే ప్రశ్నను లేవనెత్తాయి. ఈ సందర్భంగా... మెటా సోషల్ వర్చువల్ రియాలిటీ ఫ్లాట్ ఫామ్ హారిజన్ వరల్డ్, దాని వర్చువల్ రియాలిటీ హార్డ్ వేర్ వంటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో ఆసక్తి లేదా అనే చర్చా తెరపైకి వచ్చింది.

అవును... మెటా సంస్థ గత నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను నమోదు చేసిందనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో నివేదికల ప్రకారం... మెటా తన రియాలిటీ ల్యాబ్స్ బడ్జెట్ ను తగ్గించే అవకాశం ఉంది. ఆ తగ్గింపు సుమారు 30%గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రతిపాదిక కోతలు 2026 కోసం కంపెనీ వార్షిక బడ్జెట్ ప్రణాళికలో ఉన్నాయని అంటున్నారు.

అయితే... మెటావర్స్ ను నిజంగా ఇబ్బంది పెట్టిన, పెడుతున్న సమస్య ఏమిటి అనేది మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారనే చర్చా మొదలైందని అంటున్నారు. ఈ సమయంలో ఫార్చ్యున్స్ లోని ఓ నివేదిక ప్రకారం... చాలా మందికి విలువ ప్రతిపాదన అస్పష్టంగా ఉండటం ఒక సమస్యగా ఉండటంతో పాటు.. వారి స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్ టాప్ లను వదిలివేయడానికి తప్పనిసరి కారణాన్ని మెటావర్స్ ఇంకా అందించకపోవడం మరో కారణం అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మెటాకు లేఆఫ్ లు రావొచ్చని అంటున్నారు. వాస్తవానికి మెటావర్స్ యూనిట్ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ లు, వీఆర్-ఆధారిత సోషల్ నెట్ వర్క్స్ పై పనిచేస్తుంది. ఈ సమయంలో.. మెటావర్స్ యూనిట్ లోని ఎగ్జిక్యూటివ్ లతో పాటు వీఆర్ ఉద్యోగులకు కోత పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోతలు జనవరి నుండి ఉండొచ్చని అంటున్నారు.