వ్యక్తిగత గోప్యతకు కేరాఫ్ అడ్రస్ మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. ప్రత్యేకతలు ఇవే!
మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అనేవి ప్రతి ఒక్కరికి ఇష్టమే.. వీటిని కొంతమంది స్టైల్ కోసం పెట్టుకుంటారు.
By: Madhu Reddy | 19 Sept 2025 1:00 PM ISTప్రపంచం అత్యధిక టెక్నాలజీతో పరిగెడుతున్న నేపథ్యంలో అటు ప్రజలు కూడా ప్రపంచంతో పోటీపడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కొత్త టెక్నాలజీలో భాగంగా రోజుకో కొత్త పరికరాన్ని కూడా కనిపెడుతున్నారు.. టెక్నాలజీ ముందుకు వెళుతున్న కొద్దీ ప్రతి ఒక్కటి చాలా సులభతరంగా మారిపోతోంది. టెక్నాలజీ సహాయంతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్లోకి కొత్త మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసాయి.. మరి దాని విశిష్టత ఏంటి.. ? వాటివల్ల మనకు ఏం ఉపయోగాలు ఉన్నాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అనేవి ప్రతి ఒక్కరికి ఇష్టమే.. వీటిని కొంతమంది స్టైల్ కోసం పెట్టుకుంటారు. మరికొంతమంది తమకు అవసరం అయితే పెట్టుకుంటారు. అయితే ఈ స్మార్ట్ గ్లాసెస్ లో రోజువారి పనులు సులభతరం చేయడానికి సరికొత్తదైన మోడల్ వచ్చేసాయి. కొత్తగా మార్కెట్లోకి మెటా స్మార్ట్ గ్లాసెస్ రాబోతున్నాయి. రే-బాన్ తో మెటా భాగస్వామ్యం అయ్యి దీన్ని మార్కెట్లో మరింత ముందుకు తీసుకెళుతుంది..తాజాగా మార్క్ జుకర్ బర్గ్ అప్ గ్రేడ్ అయినటువంటి స్మార్ట్ గ్లాసెస్ లను అందుబాటులోకి తీసుకువచ్చారు..
ఈ స్మార్ట్ గ్లాసెస్ వాడితే చాలా సౌకర్యంగా ఉండడంతో పాటు కమ్యూనికేషన్ పై కూడా దృష్టి పెట్టవచ్చట. ఈ స్మార్ట్ గ్లాసెస్ కి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే..ఫోన్ తీసుకోకుండానే లెన్స్ పై సందేశాలను నేరుగా చూడవచ్చట. అలాగే ఫోటోలను ప్రివ్యూ చేయగల సామర్థ్యం ఈ స్మార్ట్ గ్లాసెస్ లో ఉందట.. అంతేకాదు ఏఐ మెటా స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారులకు డిస్ప్లే పై నియంత్రణ చేసే ఆప్షన్ కూడా కల్పించినట్టు తెలుస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ లో పరిస్థితిని బట్టి ఆఫ్ లేదా ఆన్ చేసుకోవడానికి వీలు కూడా కలిగించారు..
అంతేకాకుండా ఈ ఏఐ మెటా గ్లాసెస్ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడంలో సహాయపడుతుందని తెలుస్తోంది.. అయితే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇంకా మార్కెట్లోకి రాకపోయినప్పటికీ ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు మన రోజువారి పనిలో భాగమవ్వడానికి చాలామంది కృషి చేస్తున్నారు.. అయితే మార్కెట్లోకి త్వరలో రాబోతున్న ఈ ఏఐ మెటా గ్లాసెస్ ని ప్రజలు అవసరంగా భావిస్తారా.. లేక స్టైలిష్ వస్తువుల కింద చూస్తారా అనేది చూడాలి.. ఏది ఏమైనప్పటికీ టెక్నాలజీ రోజు రోజుకి రాకెట్ లా దూసుకుపోవడంతో కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొంటున్నారు..టెక్నాలజీ సహాయంతో ఏ పనైనా సరే క్షణాల్లో జరిగిపోతోంది. మరి వ్యక్తిగత గోప్యతకి కూడా సహాయం చేస్తూ.. మార్కెట్లోకి రాబోతున్న ఈ ఏఐ గ్లాసెస్ ఎలాంటి ఆదరణ పొందుతాయో చూడాలి.
