మెస్సీ శివనామస్మరణ.. ఆ వీడియో చూస్తేనే గూస్ బాంబ్స్ అంతే
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మెస్సీ ఎంతో వినయంగా సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు.
By: A.N.Kumar | 18 Dec 2025 11:44 AM ISTఫుట్ బాల్ మైదానంలో బంతితో మాయాజాలం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ‘గోట్’ లియోనెల్ మెస్సీ.. ఇప్పుడు తన ఆధ్యాత్మిక రూపంతో భారతీయులను ఆశ్చర్యపరిచారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మెస్సీ, అంబానీల ప్రతిష్టాత్మక ‘వంతారా’ జూను సందర్శించిన సందర్భంగా చోటు చేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..
శివలింగానికి అభిషేకం.. మంత్రోచ్ఛారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మెస్సీ ఎంతో వినయంగా సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు. శివలింగానికి స్వయంగా పాలాభిషేకం చేస్తూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో ‘ఓం నమ : శివాయ’ మంత్రాన్ని జపించడం అందరినీ మంత్రముగ్డులను చేస్తోంది. ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు హిందూ సంప్రదాయాలను ఇంతలా గౌరవించడం చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జై మాతాదీ అంటూ నినాదాలు
శివలింగ దర్శనమే కాకుండా.. వంతారాలోని దుర్గామాత విగ్రహం వద్ద కూడా మెస్సీ సందడి చేశారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని ‘జైమాతా దీ’ అని నినదించిన మరో వీడియో కూడా వైరల్ గా మారింది. ఢిల్లీ , ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో పర్యటించిన మెస్సీ, తన పర్యటనలో ముగింపులో ఇలా ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపడం విశేషం. మైదానంలో మెస్సీ గోల్స్ వేయడం చూశాం. కానీ ఇలా శివనామస్మరణ చేస్తాడని ఊహించలేదు. ఇది నిజంగా అద్భుతం’ అని ఒక అభిమాని సోషల్ మీడియాలో రాసుకోచ్చారు.
మెస్సీ కేవలం ఫుట్ బాల్ స్టార్ మాత్రమే కాదు.. విభిన్న సంస్కృతులను గౌరవించే గొప్ప వ్యక్తి అని ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది. భారతీయ ఆధ్యాత్మికతకు , ప్రపంచ స్థాయి క్రీడా స్ఫూర్తికి ఈ వీడియోలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మైదానంలో గోల్స్‌తో చరిత్ర సృష్టించిన మెస్సీ, ఇప్పుడు తన వినయం, సంస్కృతి పట్ల గౌరవంతో కూడా హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ వీడియోలు కేవలం వైరల్ కంటెంట్‌గా కాకుండా, సంస్కృతుల మధ్య అనుబంధానికి చక్కని ఉదాహరణగా నిలుస్తున్నాయి.
