పాదరసాన్ని బంగారంగా మార్చే టెక్నాలజీ.. స్టార్టప్ కంపెనీ సంచలనం
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. పాత రోజుల్లో అంటే.. యాభై అరవై ఏళ్ల క్రితం మన దేశంలోని పలువురు పాదరసంతో బంగారాన్ని తయారు చేయొచ్చంటూ భారీగా ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అయ్యేవారు.
By: Garuda Media | 29 July 2025 2:00 PM ISTప్రపంచంలోనే అత్యధికుల మనసుల్ని దోచే బంగారానికి ఉండే క్రేజ్ ఎంతో తెలిసిందే. ఈ విలువైన లోహాన్ని పాదరసంతోనూ తయారు చేయొచ్చని.. దీనికి సంబంధించిన సాంకేతికతను తాము డెవలప్ చేసినట్లుగా సంచలన ప్రకనట చేసిందో స్టార్టప్. యూఎస్ లోని సిలికాన్ వ్యాలీకి చెందిన మారథాన్ ఫ్యూజన్ అనే స్టార్టప్ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాదరసాన్ని బంగారంగా మార్చే టెక్నాలజీ తమ వద్ద ఉందని.. తమ ప్రయోగాలు కార్యరూపం దాలిస్తే బంగారం ధరలపై తీవ్ర ప్రబావం పడే అవకాశం ఉందని పేర్కొంది.
పాదరసంతో తయారు చేసేది మేలిమి బంగారమే అయినప్పటికీ ఫ్యూజర్ రియాక్టర్ వినియోగం కారణంగా.. పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు అందులో రేడియో ధార్మికత ఉండే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీని కారణంగా వాణిజ్య పరంగా వినియోగించే వీలుండదని చెబుతున్నారు. ఇంతకూ ఇదెలా సాధ్యమన్న ప్రశ్నకు సమాధానంగా సాంకేతిక అంశాల్ని ప్రస్తావిస్తున్నారు.
పాదరసం 198 అనే ఐసోటోప్ తొలుత పాదరసం 197గా మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బంగారం 197 ఐసోటోప్ గా మార్చొచ్చని మారథాన్ ఫ్యూజన్ వెల్లడించింది. మూలకాల మార్పిడి ద్వారా సాధ్యమని పేర్కొన్న సంస్థ.. ఈ ప్రక్రియ ద్వారా ఏటా ఐదు వేల కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేసే వీలుందని చెప్పింది. ఈ స్టార్టప్ ఇప్పటివరకు ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. నాలుగు మిలియన్ డాలర్ల ప్రభుత్వ నిధుల్ని సాధించటం గమనార్హం.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. పాత రోజుల్లో అంటే.. యాభై అరవై ఏళ్ల క్రితం మన దేశంలోని పలువురు పాదరసంతో బంగారాన్ని తయారు చేయొచ్చంటూ భారీగా ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అయ్యేవారు. అయితే.. పాదరసంతో బంగారం చేయాలన్న మాట బలంగా వినిపించినా.. దాన్ని సాధ్యం చేయలేదు. ఇదే అంశం ఇప్పుడు అమెరికాకు చెందిన ఒక సంస్థ చేతల్లో చేసి చూపిన వైనం ఆసక్తికరంగా మారింది.
