Begin typing your search above and press return to search.

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. పోస్టుమార్టంలో షాకింగ్ కారణాలు!

గత కొంతకాలంగా కుటుంబాలకు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన రేపుతోన్న సంగతి తెలిసిందే

By:  Raja Ch   |   11 Feb 2026 1:01 PM IST
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. పోస్టుమార్టంలో షాకింగ్  కారణాలు!
X

గత కొంతకాలంగా కుటుంబాలకు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన రేపుతోన్న సంగతి తెలిసిందే. సమస్య ఏదైనా దానికి ఎదో ఒక పరిష్కారం ఉంటుదనే విషయం తెలియకో.. లేక, తాము భరించలేని కష్టం తమకు వచ్చిందనే అభిప్రాయంతోనో.. అదీగాక, సహనం నశించిందనో.. ఒంటరితనం తొలిచేస్తుందనో.. మోసపోయామనో.. ఒత్తిడిని తట్టుకోలేకో.. ఏది ఏమైనా.. ఇటీవల పెద్ద ఎత్తున సంభవిస్తున్న బలవన్మరణాలు కలకలం రేపుతున్నాయి.

మొన్న ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకోగా.. అనంతరం.. తెలంగాణలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతోనూ రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల తిరుపతి జిల్లా పుత్తురులో భర్త బాధ్యత లేకుండా ఉంటున్నాడనే కారణంతో తన ఇద్దరు పిల్లలను చంపి, తాను చనిపోయింది ఓ మహిళ! ఈ క్రమంలో తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు చనిపోయి కనిపించిందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అవును... ఉత్తరప్రదేశ్ లోని మధురలో గల ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. మంగళవారం ఉదయం ఆ ఇంటి నుంచి అలికిడి రాకపోవడంతో పొరుగువారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించడంతో ఐదుగురి మరణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... 2018లో మనీష్ కుమార్ (35), మరో మహిళకు (32) వివాహం అయ్యింది. వారికి హనీ (8), ప్రియామ్షి (5), ప్రతీక్ (3) అని ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే సోమవారం రాత్రి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఈ కుటుంబం మంగళవారం బయటకు రాలేదు. దీంతో.. ఈ సమయానికి పిల్లలు అయినా ఆడుకోవడానికి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు తొలుత ఐదు మృతదేహాల పక్కన పాల గ్లాసులు కనిపించడంతో.. అందులో విషం కలిపి తాగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానించినా... పోస్టుమార్టం నివేదిక తర్వాత మాత్రం షాకింగ్ విషయం వెల్లడైందని అన్నారు. ఇందులో భాగంగా... ఈ కుటుంబంలోని భర్త ఒక కారణంతో, భార్య మరో కారణంతో, పిల్లలు ముగ్గురూ ఇంకో కారణంతో మృతిచెందినట్లు తేలిందని వెల్లడించారు.

ఇందులో.. మనీష్ విద్యుద్గాతం వల్ల మరణించగా.. అతని భార్య ఉరి వేసుకుని మరణించిందని తేలిందని అన్నారు. ఇదే సమయంలో... ముగ్గురు పిల్లాలు గొంతు కోసి చంపబడ్డారని ఎస్పీ శ్లోక్ కుమార్ తెలిపారు! ఆత్మహత్యలకు ముందుదిగా భావిసున్న ఓ సెల్ఫీ వీడియోలో మనీష్ స్పందిస్తూ... తాము తమ ఇష్టానుసారం చనిపోతున్నామని.. ఇది ఎవరి తప్పు కాదని.. పోలీసులు ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడని అన్నారు. దీంతో.. ఈ కేసు కీలకంగా మారిందని అంటున్నారు!