పడిపోనున్న బంగారు ధరలు.. బయటపడుతున్న టన్నుల కొద్దీ బంగారం.. ఎక్కడో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఇటు రూపాయి విలువ తగ్గిపోవడం.. అటు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా - రష్యా దేశాల మధ్య విభేదాలు.. ఇలా పలు కారణాలవల్ల బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 9 Aug 2025 9:30 AM ISTఇటు రూపాయి విలువ తగ్గిపోవడం.. అటు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా - రష్యా దేశాల మధ్య విభేదాలు.. ఇలా పలు కారణాలవల్ల బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. గత పది సంవత్సరాల క్రితం రూ. 30 వేల ధర పలికిన 10 గ్రాముల బంగారం విలువ.. ఇప్పుడు లక్ష దాటిపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.. ఇది సామాన్యుడికే కాదు ధనవంతుడికి కూడా భారం అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్.. బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో 10 గ్రాముల కోసమే లక్ష రూపాయలు వెచ్చించాలి అంటే.. సామాన్యుడికి అది ఎంత భారమో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ కష్టాలకు పుల్ స్టాప్ పడబోతోంది అంటూ చెప్పి స్వాంతన కలిగిస్తున్నారు. అక్కడ 100 హెక్టార్లలో ఏకంగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని, తవ్వే కొద్ది బంగారం బయటపడుతోందని.. టన్నుల కొద్దీ బంగారం కారణంగా ఇప్పుడు భారతదేశంలో బంగారం ధరలలో మార్పు రాబోతోంది అని కూడా చెబుతున్నారు . ఈ విషయం తెలిసి అటు ప్రజలు.. ఇటు ఆడవారు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఆ బంగారు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి ? జియాలజిస్టులు ఏం చెబుతున్నారు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆ ప్రాంతం ఎక్కడో కాదు మన ఇండియాలోనే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ లో భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన జియాలజిస్టులు గుర్తించారు. గ్రాములు, కిలోలు కాదు టన్నుల కొద్దీ బంగారం నిలువలను కనుగొన్నారు. జబల్‌పూర్ జిల్లాలోని మహాగ్వాన్ కియోలరీ ప్రాంతంలో ఏకంగా 100 హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల కొద్దీ పసిడి నిలువలు ఉన్నట్లు వారు కనిపెట్టారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చాము అని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త ఒకరు నేషనల్ మీడియాతో స్పష్టం చేశారు.
వాస్తవానికి ఈ ప్రాంతం పెద్ద ఎత్తున ఇనుము, మ్యాంగనీస్ నిలువలకు కేరాఫ్ అడ్రస్. అంతేకాదు లాటిరైట్, సున్నపురాయి తోపాటు సిలికా తదితర ఖనిజాలు చైనాతో సహా అనేక దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి .అయితే ఇప్పుడు ఇదే ప్రాంతంలో బంగారు నిలువలు కూడా ఉన్నాయని తేలడంతో రాబోయే సంవత్సరంలో మధ్యప్రదేశ్ దశ తిరగబోతోందని అటు మైనింగ్ రంగంలో దేశంలోనే అత్యధిక ధనిక రాష్ట్రంగా రికార్డులలోకి ఎక్కనుంది అని సమాచారం.
అయితే ఇక్కడ బంగారం పెద్ద మొత్తంలో వెలికి పడుతున్న నేపథ్యంలో మన భారతదేశంలో కూడా బంగారు ధరలు తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. మొత్తానికైతే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇక బంగారం కొనడం కలగానే మారుతుందని భావించే వారందరికీ ఇది చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ బంగారు నిక్షేపాలతో అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడబోతోందని చెప్పవచ్చు.
