వేయి మంది సూసైడ్ బాంబర్లు -.ఆపరేషన్ సింధూర్ మత్తు దిగిపోయిందా ?
ఏ విషయంలో అయినా పాక్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అని అంటారు నిపుణులు. ఆ దేశం తాను సర్వ నాశనం అయినా ఫర్వాలేదు భారత్ మాత్రం వినాశనం అవాలన్న సైకాలజీతో పనిచేస్తుంది.
By: Satya P | 12 Jan 2026 8:15 AM ISTఏ విషయంలో అయినా పాక్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అని అంటారు నిపుణులు. ఆ దేశం తాను సర్వ నాశనం అయినా ఫర్వాలేదు భారత్ మాత్రం వినాశనం అవాలన్న సైకాలజీతో పనిచేస్తుంది. ఇది ఎన్నో సార్లు రుజువు అయింది ఎన్నో దెబ్బలు భారత్ నుంచి పాక్ తింటూనే ఉంది. లేటెస్ట్ గా చూస్తే ఆపరేషన్ సింధూర్ తో దిమ్మతిరిగిపోయే స్థాయిలో భారత్ పాక్ కి గుణపాఠం చెప్పింది. సింధూ జలాలను ఆపేసి మరీ గొంతు ఎండబెట్టింది. అయినా సరే పాక్ ప్లస్ ఉగ్రవాదం చెట్టాపట్టాలు వేసుకుంటూ భారత్ మీద తమ అక్కసుని అంతా చూపిస్తున్నాయి.
జైషే మహ్మద్ హెచ్చరికలు :
తాజాగా చూస్తే జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ భారత్ కి భారీ హెచ్చరికలనే జారీ చేస్తున్నాడు. భారత్ ని ఆయన భయపెట్టాలని చూస్తున్న ప్రయత్నం ఆయన మాటలలో వ్యక్తం అయింది. ఏకంగా వేయి మందికి పైగా సూసైడ్ బాంబర్లు తన వద్ద ఉన్నారు అంటూ ఆయన బెదిరింపు మాటలు వదిలాడు. అంతే కాదు వారు ఏ క్షణమైనా భారత్ లో ప్రవేశించి అక్కడ తీవ్రమైన మారణహోమం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మసూద్ అజర్ చెప్పడం విశేషం. ఈ మేరకు ఆయన మాట్లాడిన మాటలతో కూడిన ఒక కొత్త ఆడియో ప్రసుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. గత ఏడాది భారత్ లోని కాశ్మీర్ ప్రాంతం పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. దానికి తీవ్రంగానే భారత్ బదులు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ దాడుల నేపథ్యంలో రగిలిపోతున్న పాక్ ఈ విధంగా సూసైడ్ బాంబర్లు అంటూ మసూద్ అజర్ ద్వారా హెచ్చరికలు పంపిస్తోందా అన్నదే చర్చగా ఉంది.
అంతర్జాతీయ మీడియా షేక్ అవుతుందిట :
తన వద్ద ఉన్న సూసైడ్ బాంబర్లు ఎంత మందో కనుక నంబర్ చెబితే అంతర్జాతీయ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతుందని మసూద్ అజర్ చెప్పడం విశేషం. ఒకరు ఇద్దరూ కాదు వేలలో సూసైడ్ బాంబర్లు ఉన్నారని ఆయన సంచలన ప్రకటనలు చేస్తున్నాడు. వీరంతా భారత్ లోనే దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మసూద్ అజర్ చెప్పడం ఇపుడు ప్రకంపనలు రేపుతోంది.
ఎప్పటిది ఈ ఆడియో :
సడెన్ గా ఇపుడే వెలుగు చూసిన మసూద్ అజర్ ఆడియో వైరల్ అవుతోంది. అయితే ఇది ఎప్పటిది అన్నది అయితే తెలియడం లేదు, పైగా ఎందుకు ఆయన ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో కూడా వివరణ అయితే లేదు, కానీ భారత్ మీద తన కక్షను చాటుకున్నాడని అంటున్నారు. ఐక్య రాజ్యసమితి గుర్తించిన ఈ అంతర్జాతీయ ఉగ్రవాది పాక్ లో సేఫ్ గా ఉండడమే కాకుండా ఆడియో మేసేజ్ లతో భారత్ ని బెదిరించే స్థాయిలో ఉన్నాడని అంటున్నారు. భారత్ లోకి చొరబడి దాడులు చేస్తామని తన అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తన మీద తెస్తున్నారు అని మసూద్ అజర్ చెప్పడం ఈ ఆడియోలో ఉంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ ఏకంగా పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించి తుత్తునియలు చేసింది. ఈ ఆపరేషన్ లో మసూద్ అజర్ సన్నిహితులు అలాగే చుట్టాలు ఇతరులు అంతా కలిపి ఒక డజన్ కి పైగా హతం అయ్యారు మరి ఆ ఘటనకు ప్రతి దాడి చేయడానికి సూసైడ్ బాంబర్లు అంటూ మసూద్ అజర్ స్కెచ్ గీస్తున్నాడా అన్నది ఇపుడు భారత్ భద్రతా దళాలు ఆలోచిస్తున్నాయని అంటున్నారు.
ఢిల్లీ బాంబు పేలుళ్ళ వెనక :
ఈ మధ్యనే ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ ఘటన వెనక కూడా జైషే మహ్మద్ హ్యాండ్ ఉందని ఢిల్లీ పోలీసుల విచారణ సందర్భంగా అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి. ఇక ఈ ఘటనలో దొరికిపోయిన ఉమర్ అహమ్మద్ అనే నిందితుడికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తేలింది అంటున్నారు. అయితే ఆడియో రిలీజ్ చేసినా కూడా మసూద్ అజర్ ఎక్కడ ఉనారో అయితే ఎవరికీ తెలియడం లేదు. అతను 2019 తరువాత నుంచి అండర్ గ్రౌండ్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంటున్నాడు అని అంటున్నారు. అయితే పాకిస్థాన్ లో సేఫ్ గా ఉంటూ మసూద్ అజర్ భారత్ మీద దాడులకు పక్కా ప్లాన్స్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు ఇదే అంటున్నాయి.
