Begin typing your search above and press return to search.

మార్కెట్లోకి మారుతి సుజుకి విక్టోరిస్ SUV.. లుక్, ఫీచర్స్ తెలిస్తే..

మారుతి సుజుకి తాజాగా రోడ్డుపైకి తీసుకువచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్ SUV మోడల్ లో సేఫ్టీ ఫీచర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

By:  Madhu Reddy   |   4 Sept 2025 4:00 AM IST
మార్కెట్లోకి మారుతి సుజుకి విక్టోరిస్ SUV.. లుక్, ఫీచర్స్ తెలిస్తే..
X

ఫోర్ వీలర్ లవర్స్ ను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ.. అత్యాధునిక టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉండే ధరలతో.. వాహన రంగాలు ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఒక బ్రాండ్ తో ఇంకొక బ్రాండ్ పోటీ పడుతూ కస్టమర్లను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నాయి.ఈ క్రమంలోనే మరో అందమైన, అద్భుతమైన ఫీచర్స్ తో కలిగిన మారుతి సుజుకి విక్టోరిస్ రోడ్డుపైకి వచ్చింది. బ్రెజ్జా కంటే హై ఎండ్ మోడల్ ఇది. "మారుతి సుజుకి విక్టోరిస్ SUV: గాట్ ఇట్ ఆల్" అనే ట్యాగ్ లైన్ తో త్వరలోనే ఆన్లైన్ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.

అప్పుడే అందుబాటులోకి..

దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేయబోతున్న ఈ మోడల్.. అప్పటికి అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. అప్పుడే దీని ప్రైస్ రేంజ్ కూడా వెలువడనున్నట్లు సమాచారం. మిడ్ సైజ్ ఎస్ యు వి సెగ్మెంట్లో.. మిగిలిన కంపెనీలకు ఇది తీవ్ర పోటీ ఇస్తుందనే వార్తలు వెలువడుతూ ఉండగా.. రూ.12 లక్షల వరకు దీని ధర ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. మరి ఈ కొత్త మోడల్ ఫీచర్స్ ఏ మేరకు ఉన్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.

మారుతి సుజుకి విక్టోరిస్ SUV ఫీచర్స్..

మారుతి సుజుకి తాజాగా రోడ్డుపైకి తీసుకువచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్ SUV మోడల్ లో సేఫ్టీ ఫీచర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. BNCAP క్రాష్ టెస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ అందుకుంది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశీయ మార్కెట్లో తొలిసారిగా లెవెల్ 2 ADA ఫీచర్ ను ఈ విక్టోరిస్ ఎస్ యు తోనే ఆరంభించడం గమనార్హం. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్ లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. 10.1 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఎక్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ను ఇది కలిగి ఉంటుంది. ఎయిట్ స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టంతో 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ ను కూడా అందిస్తుంది. మారుతి సుజుకి కారులో మొదటిసారి ఇందులో 10.25 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను డాష్ బోర్డులో ఏర్పాటు చేశారు.

ఆకట్టుకుంటున్న డిజైన్..

ఇక ఈ మోడల్ డిజైన్ విషయానికి వస్తే.. డిస్క్ బ్రేక్ సిస్టం ఆటో హోల్డ్ ఫంక్షన్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఈ కారు ప్రత్యేకత అని తెలుస్తోంది. అటు డిజైన్ పరంగానే విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దీని ముందు భాగం మిక్స్డ్ కలర్ తో చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఎల్ఈడి హెడ్ లాంప్స్ తో కూడిన క్రోమ్ రిబ్బన్ తో లింకప్ చేయడం మరింత స్పెషల్ గా అనిపిస్తుంది. 17 అంగుళాల ఏరో కట్ అల్లాయ్ వీల్స్, టర్బైన్ వంటి డిజైన్ ను కలిగి ఉన్నాయి. ఇక ఇంటీరియర్ డిజైనింగ్ విషయానికి వస్తే ప్రీమియం కార్ లో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. సిఎన్జి సిలిండర్ ను ఫ్లోర్ కిందకు మార్చడం వల్ల ఎస్సీఎన్జీ వేరియంట్ లో బూటు స్పేస్ చాలా మెరుగ్గా అనిపిస్తుంది.