కరోనా కంటే కర్కశంగా మరో వైరస్
ఈ మార్బర్గ్ వైరస్ లో మరణాలు రేటు చాలా అధికమని అంటున్నారు. నూటికి 88 మంది ఈ వ్యాధి సోకిన వారిలో మరణిస్తారు అని చెబుతున్నారు.
By: Satya P | 9 Dec 2025 8:00 AM ISTకరోనా ప్రపంచాన్ని భయం గుప్పిట ఉంచి మొత్తానికి మొత్తం షట్టర్ డౌన్ చేసింది. కరోనా విసిరిన మృత్యు ఊయాలలో పడి అనధికారికంగా పదుల లక్షలలోనే జనాలు ఈ ప్రపంచంలో ప్రాణాలు వదిలారు. కరోనా అంటేనే వెన్ను వణుకుతోంది. సరిగ్గా ఇప్పటికి ఆరేళ్ళ క్రితం 2019 డిసెంబర్ లో ఉనికి చాటుకున్న ఈ మహమ్మారి ఆ మీదట ప్రపంచాన్ని మొత్తంగా కమ్మేసి చిత్తుగా ఓడించేసింది. అయితే కరోనా నుంచి తట్టుకుని టీకాలతో ప్రాణాలను నిలబెట్టుకుని ప్రపంచ మానవాళి ముందుకు అడుగులు వేస్తోంది. అయితే ఈ సమయంలో మరో పెను విపత్తు పొంచి ఉంది అని అంటున్నారు. ఇది కరోనా అమ్మ కాదు అమ్మమ్మ అని కూడా అంటున్నారు. ఇంతకీ ఆ వైరస్ పేరేమిటి, దాని కధా కమామీషూ ఏమిటి అన్నది చూస్తే భయం గొలిపే విషయాలే బయటపడుతున్నాయి.
విస్తరిస్తున్న మార్బర్గ్ వైరస్ :
ప్రపంచంలో మెల్లగా మార్బర్గ్ వైరస్ విస్తరిస్తోంది అని అంటున్నారు. ఇది కరోనా కంటే యమ డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. మరో ప్రాణాంతక వైరస్ మానవాళి ముందుకు వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరిస్తోంది. ఈ వైఅస్ ఇప్పటికే దక్షిణ ఇధియోపియాలో జోరుగా వ్యాప్తి చేందుతోంది. ఈ వైరస్ సోకిన వారిలో డిసెంబర్ 3 నాటికి 13 మంది ఉంటే అందులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఈ డేంజరస్ వైరస్ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. మార్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా చెబుతున్నారు.
మరణాల రేటు అధికం :
ఈ మార్బర్గ్ వైరస్ లో మరణాలు రేటు చాలా అధికమని అంటున్నారు. నూటికి 88 మంది ఈ వ్యాధి సోకిన వారిలో మరణిస్తారు అని చెబుతున్నారు. మార్బర్గ్ వైరస్ సోకిన రోగులలో అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, తీవ్ర అలసట వంటివి ప్రారంభ లక్షణాలుగా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ వ్యాధి కనుక తీవ్రమైతే అంతర్గత అవయవాలలో తీవ్రమైన రక్తస్రావం కూడా కలుగుతుందని అంటున్నారు. అలాగే వ్యాధి ముదిరే కొద్దీ తీవ్రమైన వికారం వాంతులు చాతీ నొప్పి, అతిసారం వంటివి కూడా సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సోకిన తొందరలోనే :
ఇక మార్బర్గ్ వైరస్ సోకిన వారిలో కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల వ్యవధిలోనే మరణాలు సంభవిస్తాయని అంటున్నారు. జంతువుల నుంచి మనుషులకు ప్రధానంగా ఈ వైరస్ సోకుతుంది. ఇక వ్యాధి సోకిన రోగుల రక్తం ద్వారా వారి లాల జలం ద్వారా, ఇతర శారీరక ద్రవాల ద్వారా వారిని నేరుగా తాకినా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది అని నిపుణులు అంటున్నారు. ఇక ఇప్పటిదకా ఈ ప్రాణాంతక వ్యాధి అయిన మార్గ్ బర్గ్ వైరస్ కి ఎటువంటి టీకా కానీ మందులు కానీ లేకపోవడమే సకల భయాలకు కారణంగా ఉంది. యాంటీ వైరస్ చికిత్స అన్నది అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకుని నియంత్రణతోనే దీనిని అధిగమించాల్సి ఉందని అంటున్నారు.
