మిస్ యూనివర్స్ ఇండియా2025: మణిక విశ్వకర్మ ఎవరంటే
ఈ ఇయర్ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జైపూర్ లో జరిగిన పోటీల్లో మణిక విజేతగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Aug 2025 5:06 PM ISTఈ ఇయర్ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జైపూర్ లో జరిగిన పోటీల్లో మణిక విజేతగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశారు. గతేడాది మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచిన రియా సింఘా మణికకు ఈ కిరీటాన్ని ధరింపచేశారు. థాయ్‌లాండ్ లో నవంబర్ లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ ప్రపంచ పోటీల్లో ఇండియా తరపున మణిక పాల్గొననున్నారు.
మణిక గురించి సోషల్ మీడియాలో ఆరాలు
జైపూర్ లో జరిగిన ఈ మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో యూపీకి చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్ గా నిలవగా, సెకండ్ రన్నరప్ గా మెహక్ ధింగ్రా, థర్డ్ రన్నరప్ గా హర్యానాకు చెందిని అమిషి కౌషిక్ నిలిచారు. అయితే మణిక ఈ పోటీల్లో విన్నర్ గా గెలవడంతో ఆమె పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
కళారంగంలోనూ ప్రావీణ్యం
రాజస్థాన్, శ్రీ గంగానగర్ కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న మణికాకు చదువుతో పాటూ కళారంగంలో కూడా ప్రావీణ్యముంది. అందులో భాగంగానే ఆమె క్లాసికల్ డ్యాన్సర్ గా ఎన్నో నేషనల్ లెవెల్ కాంపిటిషన్స్ లో పాల్గొని తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. దాంతో పాటూ మణిక విశ్వకర్మకు పెయింటింగ్ లో కూడా మంచి నైపుణ్యముందట.
వాటితో పాటూ గతేడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ ను కూడా మణిక సొంతం చేసుకున్నారు. వీటన్నింటి కంటే చెప్పాల్సింది మణిక సేవాగుణం గురించి .న్యూరోనోవా అనే సంస్థను స్టార్ట్ చేసి అందులో న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడేవారికి హెల్ప్ చేస్తూ ఉంటారు మణిక. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిమ్స్‌టెక్ సెవోకాన్‌లో ఇండియా తరపున ప్రతినిధిగా కూడా మణిక పాల్గొన్నారు.
