Begin typing your search above and press return to search.

మమతా దీదీ విత్ సీజేపీ... .జెన్ జీ వ్యూహమే ?

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక వద్ద ఈ నెల 10న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపడుతోంది.

By:  Satya P   |   9 Oct 2026 9:14 AM IST
మమతా దీదీ విత్ సీజేపీ... .జెన్ జీ వ్యూహమే ?
X

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక వద్ద ఈ నెల 10న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపడుతోంది. భారీ ఎత్తున సాగే ఈ నిరసన కోసం సీజేపీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా యువతను తరలి రావాలని కోరుతోంది. తమ నిరసనతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అని సీజేపీ నేతలు కచ్చితంగా చెబుతున్నారు. అయితే సీజేపీ నిరసనలకి ఇది ఆరంభం మాత్రమే అని అంటున్నారు. ఎన్నాళ్ళు అక్కడ చేస్తారో అయితే తెలియదనే జవాబు వస్తోంది. గతంలో కూడా నీట్ పేపర్ లీకేజికి సంబంధించి విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసేంతవరకూ తాము జంతర్ మంతర్ నుంచి కదిలేది లేదని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. అలాగే ఇరవై రోజులకు పైగా ఆందోళన చేపట్టి తమ పంతం నెరవేర్చుకున్నారు. ఆఖరుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

అచ్చొచ్చిన చోటనే :

జంతర్ మంతర్ దగ్గర పోరు సీజేపీకి అచ్చొచ్చింది అని అంటున్నారు. అందుకే ఏరి కోరి మరీ అక్కడే తమ నిరసనలను కొనసాగించడానికి నిర్ణయించారు. అయితే సీజేపీ ఆందోళనలకు ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు చెప్పేశారు. తాము ఆందోళన చేస్తామని పర్మిషన్ ఇవ్వాలని సీజేపీ నేతలు కోరినా ఇదే రియాక్షన్ ఎదురైంది. దాంతో 10వ తేదీన సీజేపీ ఆందోళన ఏ విధంగా అక్కడ జరుగుతుందో అన్నది ఒక ఉత్కంఠను రేకెత్తించే అంశంగానే చూస్తున్నారు. మరో వైపు గతంలో సీజేపీ ఆందోళనకు వచ్చిన యువత అంతా ఈసారి తరలి వస్తుందా లేదా అన్నది కూడా అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

మమత హైలెట్ గా :

గతంలో సీజేపీ ఆందోళనకు ఆప్ అధినేత కేజ్రీవాల్ వచ్చారు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హైలెట్ అయ్యేలాగ కనిపిస్తోంది. తాను సీజేపీ నిరసన కార్యక్రమాలకు హాజరవుతాను అని తాజాగా ఢిల్లీలో మీడియాతో మమత చెప్పడం విశేషం. అత్యంత ముఖ్యమనిన ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం ధర్మం అని ఆమె అన్నారు. అంతే కాదు సీజేపీ ప్రతినిధులతో తమకు మంచి అనుబంధం ఉందని చెప్పుకున్నారు. దాంతో మమత జెన్ జీ తో కలిసి పోరాటాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అని అర్ధం అవుతోంది. జెన్ జీ మద్దతు కోసం ఇపుడు సంప్రదాయ రాజకీయ నేతలు అంతా చూస్తున్నారు. మమత కూడా మరింత ముందుకు అడుగేసి సీజేపీతో కలసి ఉద్యమిస్తాను అని చెప్పడం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. ఆమె ఒక వైపు ఇండియా కూటమి సమావేశాలలో పాల్గొంటూనే మరో వైపు సీజేపీతోనూ కలసి ప్రయాణించాలని అనుకుంటున్నారు.

బీజేపీ మీద ఫైర్ :

పశ్చిమ బెంగాల్ లో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల్లో ఎన్నికల సంఘం ఓట్లు తీసేసింది అని మమత ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు బీజేపీ నేతలు పాల్పడ్డారు అని ఆమె నిప్పులు చెరిగారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దేశమంతా గళమెత్తుతున్నాయని న్యాయం జరిగేంతవరకూ ఉద్యమిస్తామని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మమతా దీదీ విత్ సీజేపీ అన్నది రాజకీయంగా కొత్త కాంబో గానే ఉంది మరి. రాజకీయ వ్యూహాలలో దిట్ట అయిన మమత ఏ నిర్ణయం తీసుకున్నా అందులో చాలానే మ్యాటర్ ఉంటుంది అంటారు, దాంతో ఈ నెల 10న అందరి చూపూ జంతర్ మంతర్ నిరసనలతో పాటు మమత ప్రసంగం మీద కూడా ఉంది అని అంటున్నారు.