Begin typing your search above and press return to search.

మోడీ అమిత్ షా మధ్యన చిచ్చు పెట్టేసిన దీదీ

బెంగాల్ దీదీ గా మమితా బెనర్జీ పేరు తెచ్చుకున్నారు. వరసగా 15 ఏళ్ళుగా ఆమె పశ్చిమ బెంగాల్ ని పరిపాలిస్తున్నారు హ్యాట్రిక్ సీఎం గా రికార్డుని క్రియేట్ చేస్తున్నారు.

By:  Satya P   |   9 Oct 2025 4:00 AM IST
మోడీ అమిత్ షా మధ్యన చిచ్చు పెట్టేసిన దీదీ
X

బెంగాల్ దీదీ గా మమితా బెనర్జీ పేరు తెచ్చుకున్నారు. వరసగా 15 ఏళ్ళుగా ఆమె పశ్చిమ బెంగాల్ ని పరిపాలిస్తున్నారు హ్యాట్రిక్ సీఎం గా రికార్డుని క్రియేట్ చేస్తున్నారు. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ ని 2011లో చేజిక్కించుకున్న మమతా బెనర్జీ 2016. 2021లలో వరసగా గెలిచి తన సత్తా చాటుకున్నారు. 2026లో కూడా గెలిచి నాలుగో సారి సీఎం కావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఆమెకు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా బీజేపీ నుంచే తీవ్ర పోరు ఎదురవుతోంది.

కమలం కన్ను :

పశ్చిమ బెంగాల్ ని 2021లో గెలిచేస్తామన్నట్లుగా బీజేపీ ఆర్హ్బాటం చేసింది. నిజానికి బీజేపీ ఆ ఎన్నికల్లో 70కి పైగా అసెంబ్లీ సీట్లను సాధించింది. 2016లో కేవలం మూడు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీకి 2021లో లభించిన సీట్లు ఎన్నో రెట్లు అత్యధికం. దాంతో బలమైన విపక్షంగా మారి మమతా బెనర్జీ సర్కార్ మీద గడచిన నాలుగున్నరేళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వస్తోంది. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే ఎక్కువ సార్లు బెంగాల్ పర్యటన చేస్తున్నారు. ఈ మధ్య ఆయన టూర్ల జోరు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలలు కంటే ఎక్కువ సమయం లేకపోవడంతో ఆయన బెంగాల్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

మోడీ జాగ్రత్త అంటూ :

ప్రధాని నరేంద్ర మోడీకే మమతా బెనర్జీ తాజాగా జాగ్రత్తలు చెబుతున్నారు. అమిత్ షాతో మోడీని జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచిస్తున్నారు. అమిత్ షా యాక్టింగ్ పీఎం గా వ్యవహరిస్తున్నారు అని మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలే చేశారు. మోడీ అమిత్ షాను ఎక్కువగా నమ్మవద్దని కూడా మమతా బెనర్జీ హెచ్చరించడం విశేషం. ఆమె బెంగాల్ లో జరిగిన ప్లాసీ యుద్ధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చారు నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజు అయిన మీర్ జాఫర్ లాంటి వ్యక్తి అమిత్ షా అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

అదే విచిత్రమట :

మోడీకి అమిత్ షా గురించి అనీ తెలుసు అని అదే విచిత్రమని కూడా మమతా బెనర్జీ సెటైర్లు పేల్చారు అమిత్ షా కోరిక మేరకే దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ ఐ ఆర్ ని నిర్వహిస్తోందని ఆమె ఆరోపించారు మొత్తానికి మమతా బెనర్జీ తాజా విమర్శలు చర్చకు తావిస్తున్నాయి. ఆమె ఎపుడూ మోడీని ఎక్కువగా విమర్శించేఅవారు. తాజాగా మాత్రం మోడీని వెనకేసుకుని వస్తూ అమిత్ షా వల్లనే అంతా అంటున్నారు. ఆయనే యాక్టింగ్ పీఎం అని చెప్పడం ద్వారా అసలైన అధికారం ఆయన చేతిలో ఉందని మమతా బెనర్జీ చెబుతున్నారు.మరి మమత ఈ విమర్శల మీద బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.