Begin typing your search above and press return to search.

"4 గంటల్లో ఖ‌ర్గేకు నోటీసులు.. మ‌రి మోడీ మాటేంటి?"

2024 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో పిఠాపురం టికెట్‌ను ఆయ‌న వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. జ‌న‌సేన‌తో పొత్తు నేప‌థ్యంలో టీడీపీ ఆయ‌న‌కు టికెట్‌ను నిరాకరించింది.

By:  Garuda Media   |   23 April 2026 10:38 AM IST
4 గంటల్లో ఖ‌ర్గేకు నోటీసులు.. మ‌రి మోడీ మాటేంటి?
X

"4 గంటల్లో ఖ‌ర్గేకు నోటీసులు.. మ‌రి మోడీ మాటేంటి?"- ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయాల్లో ప్ర‌కం ప‌న‌లు సృష్టిస్తున్న అంశం. దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రించిన తీరు!. తాజాగా రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. 1) కాంగ్రెస్ స‌హా ఇత‌ర విప‌క్షాలు.. ప్ర‌ధాని మోడీపై ఎన్నికల సంఘా నికి, అదేవిధంగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించా రని.. చ‌ర్య‌లుతీసుకోవాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కంప్లెయింట్ చేశారు.

ఇదేస‌మ‌యంలో ఈ నెల 18న జాతిని ఉద్దేశించి చేసిన మోడీ ప్ర‌సంగంలో మ‌హిళా బిల్లు విష‌యంలో విప‌క్ష ఎంపీల‌ను అవ‌మానించార‌ని.. నింద‌లు వేశార‌ని పేర్కొంటూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స‌హా.. ప‌లువురు స్పీక‌ర్ ఓంబిర్లాకు స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న కింద మోడీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ రెండు ప్ర‌ధాని మోడీకి సంబంధించిన ఫిర్యాదులు. అయితే.. వీటిపై ఎక్క‌డా అటు లోక్‌స‌భ స్పీక‌ర్ కానీ.. ఇటు ఎన్నిక‌ల సంఘం కానీ.. స్పందించ‌లేదు.

క‌ట్ చేస్తే..

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. త‌మిళ‌నాడు ఎన్నిక ల ప్ర‌చారంలో ప్ర‌ధాని మోడీపై చేసిన ఒకే ఒక వ్యాఖ్య పై కేంద్ర మంత్రులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌నపై ఫిర్యాదు చేయ‌గా.. కేవ‌లం 4 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఎన్నిక‌ల సంఘం ఖ‌ర్గేపై సీరియ‌స్ అయింది. ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. వాస్త‌వానికి రెండు అంశాలు ఎన్నిక‌ల కోడ్‌కు విరుద్ధంగా ఉన్న‌వేన‌న్న‌ది సుస్ప‌ష్టం.

కానీ.. మోడీపై ఇచ్చిన ఫిర్యాదు విష‌యంలో ఒక విధంగా ఖ‌ర్గేపై ఇచ్చిన ఫిర్యాదు విష‌యంలో మ‌రో విధంగా ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై దేశ‌వ్యాప్తంగా విప‌క్ష‌లు మండిప‌డుతున్నాయి. ప్ర‌ధాని విష‌యంలో ఒక నియ‌మం. ఖ‌ర్గే విష‌యంలో మ‌రో నియ‌మ‌మా? అంటూ.. నిప్పులు చెరుగుతున్నాయి. ఒక‌వైపు త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌(ఫ‌స్ట్ ఫేజ్‌) పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇలా ద్వంద్వ ప్ర‌మాణాలు పాటించ‌డం ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.