ఆ కేసులో మోడీని ఇరికించాలని చూస్తున్నారు: ప్రజ్ఞ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని ప్రసిద్ధ ధార్మిక ప్రాంతం నాసిక్‌కు సమీపంలో ఉన్న మాలేగావ్‌లో 2006, సెప్టెంబరు 8న వరుస పేలుళ్లు జరిగాయి.
By: Garuda Media | 3 Aug 2025 8:52 AM ISTమహారాష్ట్రలోని ప్రసిద్ధ ధార్మిక ప్రాంతం నాసిక్‌కు సమీపంలో ఉన్న మాలేగావ్‌లో 2006, సెప్టెంబరు 8న వరుస పేలుళ్లు జరిగాయి. ఈ కేసు విచారణ పూర్తయి.. దోషులుగా కూడా కొందరు తేలారు. ఇది.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ-1 హాయంలో చోటు చేసుకుంది. అయితే.. ఈ కేసులో దోషులుగా ఉన్న కొందరిని తాజాగా కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ.. వారిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎంపీ.. బీజేపీ నాయకురాలు ప్రజ్ఞ ఠాకూర్ సాద్వి.. శనివారం జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాలేగావ్ పేలుళ్ల ఘటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇరికించే కుట్ర సాగిందని.. తనను బలవంతంగా నిర్బంధించి.. అరెస్టు చేశారని ఆమె చెప్పారు. తనను దారుణంగా కొట్టారని.. మహిళను, పైగా సాధ్విని అయినా.. తనను హింసించారని ప్రజ్ఞ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాని మోడీ సహా.. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కూడా ఇరికించే కుట్రలు జరిగాయన్నారు. దీనికి కారణం.. రాజకీయాలేనని అన్నారు. అదేసమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును కూడా చెప్పాలని తనను కొట్టినట్టు అప్పటి దర్యాప్తు అధికారులపై ఆమె ఆరోపణలు చేశారు. అయితే.. దీనిపై ఏటీఎస్ అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు.
ఫిర్యాదు చేస్తా!
మాలేగావ్ పేలుళ్ల కేసులో విచారణ చేపట్టిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అధికారుల తీరుపై.. అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో ఇదే విబాగంలో పనిచేసిన ఓ అధికారి వీఆర్ ఎస్ తీసుకుని బయటకు వచ్చినప్పుడు కూడా.. ఇలాంటి ఆరోపణలే చేశారు. మాలేగావ్ కేసును దారి తప్పించారని.. దీనిని నిక్షాక్సికంగా విచారణ చేయడం లేదని ఆరోపించారు. తమకు వ్యతిరేకులుగా ఉన్న కొందరు పేర్లను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ప్రజ్ఞా ఠాకూర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా.. తనకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రజ్ఞ తెలిపారు. దీనిపై కేసు వేస్తానని.. ఏటీఎస్ అదికారులను కోర్టుకు లాగుతానని అన్నారు.
ఏంటీ ఘటన..?
2006, సెప్టెంబరు 8న మాలేగావ్‌లోని ఓ ప్రముఖ మసీదు వద్ద వరుస పేలుళ్లు సంభవించాయి. ఆ రోజు శుక్రవారం కావడంతో వేలాదిగా ముస్లింలు ప్రార్థనల కోసం వచ్చారు. వీరినే లక్ష్యంగా చేసుకుని స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్.. దళ సభ్యులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 45 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. దీనిని మహారాష్ట్ర పోలీసులు సహా.. ఏటీఎస్ అదికారులు సంయుక్తంగా విచారించారు. 2013లో దీనికి సంబంధించిన చార్జిషీట్ దాఖలైంది.
