Begin typing your search above and press return to search.

విమానంలో మంటలు.. ప్రాణభయంతో ప్రయాణికులు ఏం చేశారంటే?

అసలు విమానాలు ఎక్కాలంటేనే దడ పుట్టేస్తోంది.. కానీ రోజుకు లక్షలాదిమంది ఒక దేశం నుండి మరో దేశానికి.. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి విమాన ప్రయాణం చేస్తూ ఉంటారు

By:  Madhu Reddy   |   12 Aug 2025 2:54 PM IST
విమానంలో మంటలు.. ప్రాణభయంతో ప్రయాణికులు ఏం చేశారంటే?
X

ఈ మధ్యకాలంలో తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు విమానాలు ఎక్కాలంటేనే దడ పుట్టేస్తోంది.. కానీ రోజుకు లక్షలాదిమంది ఒక దేశం నుండి మరో దేశానికి.. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి విమాన ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో విమాన సంస్థలు విమానాల్లో ఉండే సాంకేతిక సమస్యలను ముందుగా గుర్తించకపోవడంతో తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.

అయితే తాజాగా మరో విమాన ప్రమాదం జరిగింది. అదెక్కడో ఇప్పుడు చూద్దాం..

తాజాగా మలేషియాలోని కౌలలాంపూర్ నుండి వస్తున్న కార్గో విమానం ప్రమాదానికి గురైంది. అది కూడా అగ్ని ప్రమాదానికి.. కౌలలాంపూర్ నుండి చెన్నైలో ల్యాండింగ్ అవ్వాల్సిన కార్గో విమానం.. ల్యాండ్ అవ్వాల్సిన సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. విమానం ల్యాండ్ అవుతుండగానే అందులో మంటలు చెలరేగడంతో.. ప్రాణభయంతో ప్రయాణికులు కూడా గగ్గోలు పెట్టేశారట. కానీ పైలెట్ చాలా తెలివిగా వ్యవహరించి... ముందుగానే విమానాశ్రయంలో ఉండే అధికారులను అప్రమత్తం చేశారు. ఇక పైలట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విమానం ల్యాండింగ్ అయిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది విమానంలోని మంటలను ఆర్పేశారు. దీంతో విమానం అగ్ని ప్రమాదం నుండి బయటపడింది. ఈ ప్రమాదంలో ఎవరికి కూడా గాయాలు కాలేదు. అందరూ ప్రాణాలతోనే ఉన్నారు. అయితే విమానంలో మంటలు ఎలా వచ్చాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో జరిగే విమాన ప్రమాదాల గురించి విమానాలు తయారు చేసే కంపెనీలపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సాంకేతిక సమస్యలను గుర్తించకుండానే విమానాలను ఉపయోగిస్తున్నారని, విమానం బయలుదేరే ముందు కచ్చితంగా అందులో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా అని ముందే గుర్తించాలంటూ డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎంతో మంది చనిపోయారు. ఈ ఎయిర్ ఇండియా విమానం మెడికల్ కాలేజీ పై పడడంతో మెడికల్ కాలేజీలో ఉన్న కొంతమంది విద్యార్థులు కూడా మరణించారు. అలా 274 మంది ఈ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ మధ్యకాలంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే అతి ఘోరమైన విమాన ప్రమాదం అని.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుండి చాలామంది విమానాల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు అని చెప్పవచ్చు.

దానికి తోడు వరుసగా విమాన ప్రమాదాలు జరగడంతో విమానం ఎక్కిన వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు గమ్య స్థానాన్ని చేరుతామా అని భయం భయంగా ప్రయాణిస్తున్నారు. ఇక రీసెంట్ గా తిరువనంతపురం

(Thiruvanthapuram) నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చెన్నై (Chennai) ఎయిర్ పోర్ట్ లోనే ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇంజన్ల సమస్య ఉందని పైలట్ ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో సేఫ్ గా విమానం ల్యాండ్ అయ్యింది.