Begin typing your search above and press return to search.

23 మంది ఐపీఎస్‌ లు బదిలీ... సిటీకి సజ్జనార్!

తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By:  Raja Ch   |   27 Sept 2025 11:22 AM IST
23 మంది ఐపీఎస్‌  లు బదిలీ... సిటీకి  సజ్జనార్!
X

తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా... హైదరాబాద్‌ కమిషనర్‌ గా వీసీ సజ్జనార్‌ ను నియమించింది. ఇదే క్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.

అవును... దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌ కౌంటర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని దిగ్గజ పోలీసు అధికారులలో ఒకరుగా మరింతగా మారుమ్రోగిపోయిన వీసీ సజ్జనార్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... హైదరాబాద్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న సజ్జనార్.. ఆ బాధ్యతల్లోనూ తనదైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారనే చెప్పాలి! ఇదే సమయంలో ఆన్‌ లైన్ బెట్టింగ్ సంస్కృతికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని అమలు చేశారు. 2021 కి ముందు ఆయన సైబరాబాద్ కమిషనర్‌ గా పని చేశారు.

ట్రాన్స్ ఫర్ అయిన 23 మంది అధికారులు వీరే!:

హైదరాబాద్ కమిషనర్ గా వీసీ సజ్జనార్

హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌

ఫౌరసరఫరాల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా స్టీఫెన్‌ రవీంద్ర

ఇంటెలిజెన్స్‌ డీజీగా విజయ్‌ కుమార్‌

ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌

ప్రస్తుతం సీఐడీ అడిషనల్ డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు

గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్

మల్టీజోన్ 2 ఐజీగా డీఎస్‌ చౌహన్

విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్

హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు

హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌ గా తఫ్సీర్ ఇక్బాల్

ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌ గా సింధు శర్మ

ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌ గా సీహెచ్‌ ప్రవీణ్ కుమార్

మాదాపూర్ డీసీపీగా రితు రాజ్

వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్

రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్

ఎల్బీనగర్ డీసీపీగా బి. అనురాధ

సిద్దిపేట కమిషనర్‌ గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్

నారాయణపేట ఎస్పీగా జి. వినీత్

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌ గా రవి గుప్తా