Begin typing your search above and press return to search.

ఎంతో అరుదు: మూడో కాన్పులో నలుగురుకి జన్మనిచ్చింది

అయితే.. ఇప్పుడు చెప్పే ఉదంతం రోటీన్ కు కాస్త భిన్నం. ఎందుకంటే ఈ సూపర్ అమ్మ తన మూడో కాన్పులో నలుగురికి జన్మనివ్వటం ఆసక్తికరంగా మారింది.

By:  Garuda Media   |   15 Sept 2025 9:54 AM IST
ఎంతో అరుదు: మూడో కాన్పులో నలుగురుకి జన్మనిచ్చింది
X

ఒకేసారి నలుగురికి జన్మనిచ్చే తల్లుల ఉదంతాలు మీరు ఇప్పటికే విని ఉంటారు. చదివి ఉంటారు. అయితే.. ఇప్పుడు చెప్పే ఉదంతం రోటీన్ కు కాస్త భిన్నం. ఎందుకంటే ఈ సూపర్ అమ్మ తన మూడో కాన్పులో నలుగురికి జన్మనివ్వటం ఆసక్తికరంగా మారింది. ఎంతో అరుదుగానే ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంటుందని చెబుతున్నారు. ఈ సూపర్ మమ్మీ.. తన తొలి కాన్పులో కవలలకు జన్మనివ్వగా.. రెండో కాన్పులో మాత్రం ఒక్కరికే జన్మనిచ్చారు. ముచ్చటగా మూడో కాన్పులో మాత్రం ఏకంగా నలుగురికి జన్మనివ్వటం ఆసక్తికరంగా మారింది.

ఈ అరుదైన ఉదంతానికి మహారాష్ట్రలోని సతారా జిల్లా వేదికగా మారింది. ఫూణె జిల్లాకు చెందిన ఒక మహిళా తన ఉద్యోగరీత్యా కోరెగావ్ లో ఉంటున్నారు. నిండు గర్భవతి అయిన ఆమె.. రెండు రోజుల క్రితం సతారా జిల్లా ఆసుపత్రిలో చేరారు. అనూహ్యంగా నొప్పులు రావటంతో.. పరీక్షలు నిర్వమించిన వైద్యలు.. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వెంటనే సిజేరియన్ చేశారు.

డెలివరీ సమయంలో అనూహ్యంగా నలుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లుగా వైద్యులు వెల్లడించారు. మొదటి కాన్పులో ఆమె ఇద్దరు కవలల (ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి)కు జన్మనిచ్చారు. రెండో కాన్పులో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. మూడో కాన్పులో నలుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చారు. తాజా కాన్పులో ఆమె కన్న నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా.. ఒకరు అబ్బాయిగా వైద్యులు చెప్పారు. వారి బరువు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మొత్తం మూడు కాన్పుల్లో ఏడుగురికి జన్మనిచ్చిన ఈ అమ్మ సూపర్ మమ్మీగా పేర్కొంటున్నారు.