Begin typing your search above and press return to search.

'కరోనా – సనాతన'... ఉదయనిధి వ్యాఖ్యలపై హైకోర్టు స్ట్రాంగ్ రియాక్షన్!

అవును... 2023లో సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారీ రాజకీయ కలకలం రేపిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   21 Jan 2026 12:13 PM IST
కరోనా – సనాతన... ఉదయనిధి వ్యాఖ్యలపై హైకోర్టు స్ట్రాంగ్  రియాక్షన్!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ 2023లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో.. ఈ వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్.ఐ.అర్.ను రద్దు చేసింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... 2023లో సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారీ రాజకీయ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దీనిపై స్పదించిన మద్రాస్ హైకోర్టు.. ఆ వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని పేర్కొంది. ఈ సందర్భంగా హైకోర్టు మధురై బెంచ్ తీవ్ర పదజాలంతో చేసిన వ్యాఖ్యలలో.. గత 100 సంవత్సరాలకు పైగా డీఎంకే హిందూ మతంపై స్పష్టమైన దాడి చేస్తోందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎస్ శ్రీమతి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... గత 100 సంవత్సరాలుగా ద్రవిడ కజగం, ఆ తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం హిందూ మతంపై స్పష్టమైన దాడి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రారంభించిన వ్యక్తులు శిక్షార్హులు కాకుండా విడుదల చేయబడుతున్నారని.. అలాంటి ద్వేషపూరిత ప్రసంగానికి ప్రతిస్పందించే వారు చట్టం యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారని.. ఈ సమయంలో ప్రతిస్పందించిన వారినే కోర్టులు ప్రశ్నిస్తున్నాయని ఆమె జోడించారు!

ఇదే క్రమంలో... సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల సమూహం అక్కడ ఉండకూడదనుకుంటే, దానికి తగిన పదం 'జాతిహత్య'.. సనాతన ధర్మం ఒక మతం అయితే అది 'మతహత్య'.. పర్యావరణ విధ్వంసం, సంస్కృతి విధ్వంసంపై విభిన్న దాడులతో ఏదైనా పద్ధతులు లేదా వివిధ పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రజలను నిర్మూలించడం అని కూడా దీని అర్థం.. కాబట్టి, 'సనాతన ఒజిప్పు' అనే తమిళ పదబంధం స్పష్టంగా జాతి విధ్వంసం అని అర్థం అని కోర్టు పేర్కొంది.

ఇదే సమయంలో... 'సనాతన ఒజిప్పు' అనే తమిళ పదబంధం స్పష్టంగా జాతిహత్య లేదా సంస్కృతి హత్య అని అర్థమని.. అటువంటి పరిస్థితులలో, మంత్రి ప్రసంగాన్ని ప్రశ్నిస్తూ చేసిన పోస్ట్ ద్వేషపూరిత ప్రసంగం కాదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఐటి సెల్ అధిపతి అమిత్ మాల్వియాపై తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్. ను జస్టిస్ ఎస్ శ్రీమతి కొట్టివేశారు.

అసలేమిటీ వివాదం!:

తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన 'సనాతన్ అబోలిషన్ కాన్ఫరెన్స్' అనే సమావేశంలో సెప్టెంబర్ 2, 2023న ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా... "కొన్ని విషయాలను వ్యతిరేకించలేము.. వాటిని రద్దు చేయాలి. మనం డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనాను వ్యతిరేకించలేము.. మనం వాటిని నిర్మూలించాలి. అదే విధంగా, మనం సనాతనాన్ని వ్యతిరేకించడం కంటే, దానిని నిర్మూలించాలి" అని అన్నారు.

"సనాతన ధర్మం ప్రాథమికంగా సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకం.. అది కులం, మతం ఆధారంగా విభజనలను కలిగిస్తుంది" అని ఆయన ఆరోపించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అనంతరం మరోసారి స్పందించిన ఉదయనిధి స్టాలిన్... సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలకు తాను గట్టిగా కట్టుబడి ఉన్నానని.. తన వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల మారణహోమానికి పిలుపు కాదని స్పష్టం చేశారు.

ఈ సమయంలో... జనవరి 2025లో 'సనాతన ధర్మం' వ్యాఖ్యలకు సంబంధించి ఉదయనిధిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు... ఆయన ప్రసంగాన్ని షేర్ చేస్తూ.. ఆ ప్రకటన సనాతన ధర్మాన్ని అనుసరించే భారత జనాభాలో 80% మందిని నరమేధం చేయమని పిలుపునిచ్చినట్లు కాదా అని ప్రశ్నించిన అమిత్ మాల్వియాపై తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను తాజాగా హైకోర్టు కొట్టివేసింది.