Begin typing your search above and press return to search.

వామ్మో.. అర్ధరాత్రుల్లో రోడ్లపై వీటిని కూడా దొంగిలిస్తారారయ్యా...!

దొంగతనాలందు ఈ దొంగతనం వేరయా అనే ఓ షాకింగ్ విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

By:  Raja Ch   |   9 Jan 2026 3:32 PM IST
వామ్మో.. అర్ధరాత్రుల్లో  రోడ్లపై వీటిని కూడా దొంగిలిస్తారారయ్యా...!
X

దొంగతనాలందు ఈ దొంగతనం వేరయా అనే ఓ షాకింగ్ విషయం తాజాగా తెరపైకి వచ్చింది. సాధారణంగా డబ్బులు, బంగారం, వెండి, ఏటీఎంల చోరీ వంటివి జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. కొన్ని గ్రామాల్లో అయితే కోళ్లు, కుక్కల దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. మరికొన్ని చోట్ల కొబ్బరి బొండాలు, మామిడి కాయలు వంటి కార్యక్రమాలూ జరుగుతుంటాయి! అయితే తాజాగా జరిగిన చోరీ మాత్రం రొటీన్ కు భిన్నంగా జరిగింది.

అవును... దొంగతనాయలయందు ఈ దొంగతనం వేరయా అనే ఘటన మధ్యప్రదేశ్ లోని విదీష జిల్లాలో జరిగింది. ఇందులో భాగంగా... రహదారులపై ట్రాఫిక్ వేగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన పలు స్పీడ్ బ్రేకర్లను దొంగలు దొంగిలించారు. దీంతో ఈ దొంగతనం విషయం సంచలనంగా, సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ స్పీడ్ బ్రేకర్లను ఇటీవల నగర మున్సిపల్ కార్పొరేషన్ సుమారు రూ.8 లక్షలతో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

స్థానిక మెయిన్ రోడ్డు, దుర్గా నగర్ చౌరస్తా, జిల్లా కోర్టు, వివేకానంద చౌక మధ్య ఉన్న ప్రంతమంలో నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలా రాత్రికి రాత్రి ఈ దొంగతనం జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా పైన చెప్పుకున్న ప్రాంతాలన్నీ రోజంతా ట్రాఫిక్ తో, పోలీసుల పెట్రోలింగ్ తో బిజీగా ఉండే ప్రాంతాలని చెబుతున్నారు అధికారులు! అయినప్పటికీ వారు ఈ పనికి పూనుకోవడం గమనార్హం. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పౌరసంఘం చీఫ్ మున్సిపల్ అధికారి దుర్గేష్ ఠాకూర్.. ఈ సంఘటనను ధృవీకరించారు, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్లపై బలంగా వేయబడిన ఆ స్పీడ్ బ్రేకరలను రాత్రి సమయంలో ఎలా తొలగించారు.. ఏవిధంగా ఎత్తుకెళ్లారో తెలుసుకోవడానికి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజల్ను స్కాన్ చేస్తున్నారు.

కాగా... రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలను కంట్రోల్ చేసి, ప్రమాదాలను తగ్గించడానికి అధికారులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇవి సిమెంట్ రోడ్డు, తారు రోడ్డుపై వేరు వేరుగా ఉంటాయి. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం.. హైవేపై స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడదు!