Begin typing your search above and press return to search.

క‌డ‌ప టాక్‌: రెడ్డ‌మ్మ హ‌వానేన‌ట‌.. !

క‌డ‌ప అసెంబ్లీ సీటు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీ రెడ్డి.. హ‌వా ఇటీవ‌ల కొంత మేర కు మంద‌గించినా.. మ‌ళ్లీ గ‌త నెల రోజులుగాభారీగా పుంజుకుంది.

By:  Garuda Media   |   21 March 2026 4:00 AM IST
క‌డ‌ప టాక్‌:  రెడ్డ‌మ్మ హ‌వానేన‌ట‌.. !
X

క‌డ‌ప అసెంబ్లీ సీటు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీ రెడ్డి.. హ‌వా ఇటీవ‌ల కొంత మేర కు మంద‌గించినా.. మ‌ళ్లీ గ‌త నెల రోజులుగాభారీగా పుంజుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న మాద‌వి.. తొలి రోజుల్లోనే దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. వైసీపీ నాయ‌కుల అవినీతి, అక్ర‌మాలు.. అంటూ.. విరుచుకుప‌డ్డారు. వారి ఇళ్ల ముందుకు వెళ్లి ఆందోళ‌న చేశారు. అదేస‌మ‌యంలో త‌మ‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నారంటూ.. సొంత పార్టీ నాయ‌కుల‌ను కూడా దూరం పెట్టారు.

దీంతో కొన్ని రోజులు వివాదాల‌కు కేంద్రంగా మాధ‌వి నిలిచార‌న్న వాద‌న బ‌లంగా వినిపించింది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. సైలెంట్ అయినా.. ఇటీవ‌ల క‌డ‌ప కార్పొరేష‌న్‌ను ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని భావించిన మాధ‌వి.. వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇటీవ‌ల‌.. న‌లుగురు కార్పొరేట‌ర్ల‌ను త‌నవైపు తిప్పుకోవడం ద్వారా.. మాధ‌వి మ‌రింత దూకుడు పెంచారు. మ‌రో రెండు మూడు మాసాల్లోనే కార్పొరేష‌న్‌ను హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

అయితే.. అప్ప‌టికే కార్పొరేష‌న్ గ‌డువు పూర్తయ్యే అవ‌కాశం ఉంది. ఇది ఎలా ఉన్నా..వైసీపీ ఇలాకాలో మాధ‌వి హ‌వాకు ఇది నిద‌ర్శ‌నంగా మార‌నుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు.. అభివృద్ధి ప‌రంగా కూడా.. మాధ‌వి దూకుడుగానే వ్య‌మ‌హ‌రిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌ను వేగం పెంచారు. ర‌హ‌దారుల నిర్మాణంతోపాటు.. పాత స‌మ‌స్య‌ల‌ను ప రిష్క‌రిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటు లో ఉంటున్నారు. ఈ ప్ర‌భావం ఎక్కువ‌గానే క‌నిపిస్తుంద‌ని అంచనా వేస్తున్నారు.

ఇక‌, సొంత పార్టీ నాయ‌కుల‌తో కొన్నాళ్లుగా వివాదాలు కొన‌సాగినా.. ప్ర‌స్తుతం వివాదాల‌కు దూరంగా వ్య‌వ హ‌రిస్తున్నారు. అంతేకాదు.. అంద‌రినీ క‌లుపుకొని పోయేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం ద్వారా నేత‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప‌రిణామంతో మాధ‌వి గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ క‌డ‌ప‌లో వినిపిస్తోంది. ఇదిలావుంటే.. వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించే నాయ‌కులు సైలెంట్ కావ‌డం కూడా మాధ‌వికి క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు. మొత్తంగా క‌డ‌ప‌లో మాధ‌వి హ‌వా జోరుగా సాగుతోంద‌ని చెబుతున్నారు.