మడకసిర ముచ్చట.. వాట్ నెక్ట్స్ ఎంఎస్. రాజు...?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గం మడకశిర. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఏ విధమైన మార్పులు చేర్పులు ఉంటాయి అన్నది ఆసక్తికర అంశంగా మారింది.
By: Garuda Media | 11 May 2026 11:00 AM ISTఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గం మడకశిర. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఏ విధమైన మార్పులు చేర్పులు ఉంటాయి అన్నది ఆసక్తికర అంశంగా మారింది. గత ఎన్నికల్లో ఎంఎస్ రాజు టిడిపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇదే సమయంలో వైసీపీ తరఫున పోటీ చేసిన లక్కప్ప కూడా భారీ పోటీయే ఇచ్చారు. ఈ క్రమంలో కేవలం 351 ఓట్ల తేడాతో లక్కప్ప ఓడిపోగా.. ఎమ్మెస్ రాజు విజయం సాధించారు. కానీ ఇది రాష్ట్ర స్థాయిలోనే అత్యంత స్వల్ప మెజారిటీ.
ఈ క్రమంలో రాజు మరింతగా ఓటు బ్యాంకును పెంచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు వైసిపి తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి మారే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో మార్పు చేర్పులు భారీగానే ఉండే ఛాన్స్ ఉంటుందని రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మరి ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా ఎమ్మెస్ రాజు అడుగులు వేస్తున్నారా అంటే లేదనే సమాధానం స్పష్టంగా వినిపిస్తోంది. పార్టీలోనూ అటు ప్రజల మధ్య కూడా ఆయన పెద్దగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో సమస్యలపై స్పందించినప్పటికీ తర్వాత ఎదురవుతున్న సమస్యలను ఆయన పరిష్కరించలేకపోతున్నారనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. దీని నుంచి ముఖ్యంగా ఆయన బయటపడాలి. అదే సమయంలో ఓటు బ్యాంకు ను పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే కేవలం 351 తేడాతోనే విజయం సాధించిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి మార్పులు వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి ఉండకపోవచ్చు అని టిడిపి వర్గాల్లో వినిపిస్తోంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెస్ రాజు మరింత బలంగా ప్రజల మధ్యకు వెళ్లాలి. పార్టీ తరఫున పనులు చేయాలి. పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోవాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ తరఫున చేస్తున్న కార్యక్రమాలను ఆయన మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చు అనేది పరిశీలకుల అంచనా. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇదిలావుంటే.. ప్రత్యర్థులపై ఉద్దేశ పూర్వకంగానేకేసులు పెట్టిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇది నిజమే అయితే..సరిచేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
