'విలాస' నగరాలు లేవు.. భారత్ ఎందుకిలా?
అందరూ ఊహించినట్టుగానే ప్రతి ఏటా సింగపూర్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంది. లండన్(బ్రిటన్ రాజధాని), హాంకాంగ్(చైనా). మొనాకో వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
By: Garuda Media | 7 Dec 2025 7:00 AM ISTతాజాగా ప్రపంచ వ్యాప్తంగా విలాస వంతమైన నగరాలు ఉన్న దేశాల జాబితా విడుదలైంది. ప్రతి సంవత్స రం.. ఈ జాబితాను విడుదల చేస్తున్నారు. తద్వారా ప్రపంచ స్థాయి పర్యాటక రంగాన్ని మరింత పెంచేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ జాబితాను `జులియస్ బేర్ గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్` సంస్థ విడుదల చేస్తుంది. ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా.. విలాసవంతమైన నగరాలను ఈ జాబితాలో పేర్కొంటారు.
అందరూ ఊహించినట్టుగానే ప్రతి ఏటా సింగపూర్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంది. లండన్(బ్రిటన్ రాజధాని), హాంకాంగ్(చైనా). మొనాకో వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే.. భారత్ మాత్రం తొలి పది దేశాల్లో ఎక్కడా చొటు దక్కించుకోలేక పోయింది. పైగా.. 20వ స్థానంలో నిలిచింది. అది కూడా.. మహారాష్ట్ర రాజధాని ముంబైకి మాత్రమే ఆ అవకాశం చిక్కింది. దీనికికారణం.. ఏంటి? ఎందుకు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు పది లక్షల మంది ఈ కారణాలపై గూగుల్‌లో వెతకడం గమనార్హం.
ప్రధానంగా భారత్ ఎప్పుడూ విలాసవంతమైన జీవన శైలిని కోరుకోదు. విలాసవంతమైన మానసిక స్థయి ర్యాన్ని మాత్రమే కోరుకుంటోంది!. పైగా నూటికి 92 శాతం మంది ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారే కనిపి స్తారు. అంతేకాదు.. దేవ భూమిగా, వేద భూమిగా పేరున్న భారత్‌లో విచ్చలవిడి శృంగారానికి.. విచ్చలవిడి వ్యవహారాలకు ఎవరూ ఇష్టపడరు. కుటుంబ వ్యవస్థకు ప్రపంచ దేశాల్లో వాల్యూ ఇస్తున్న ఏకైక దేశం భారత్ కావడం కూడా గమనార్హం.
ఇక, విలాసవంతమైన నగరాల జాబితాను పరిశీలిస్తే.. విచ్చలవిడి శృంగార అనుమతులకు ఆయా దేశాలకు పెట్టింది పేరుగా ఉన్నాయి. అదేవిధంగా జూదం సహా ఇతర అంశాల్లోనూ ఆయా దేశాలకు అనుమతులు ఉన్నాయి. పైగా.. భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో పొదుపు గా జీవించాలన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుండడం కూడా భారత్‌ను ఈజాబితాలో 20వ స్థానానికి పరిమితం చేసింది.
