Begin typing your search above and press return to search.

1911 నుంచి లౌవ్రే మ్యూజియంలో అతిపెద్ద దోపిడీలు ఇవే!

అవును... పారిస్‌ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం దోపిడీ తర్వాత మూసివేయబడిందని ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి రచిదా దాటి ధృవీకరించారు.

By:  Raja Ch   |   19 Oct 2025 7:45 PM IST
1911 నుంచి లౌవ్రే మ్యూజియంలో అతిపెద్ద దోపిడీలు ఇవే!
X

పారిస్‌ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం ఆదివారం నాడు దోపిడీ తర్వాత మూసివేయబడిందని ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి రచిదా దాటి ధృవీకరించారు. పోలీసులు, మ్యూజియం అధికారులు ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు నెపోలియన్ కాలం నాటి సుమారు తొమ్మిది ఆభరణాలను దోచుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.

అవును... పారిస్‌ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం దోపిడీ తర్వాత మూసివేయబడిందని ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి రచిదా దాటి ధృవీకరించారు. ఏమి దొంగిలించబడింది, దోపిడీ ఎలా జరిగిందనే దాని గురించి అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 1911 నుంచి ఇప్పటివరకూ ఈ మ్యూజియంలో జరిగిన దోపిడీలను ఒకసారి పరిశీలిద్దామ్..!

1911లో మోనాలిసా దొంగతనం!:

ఆగస్టు 21, 1911న విన్సెంజో పెరుగ్గియా అనే వ్యక్తి.. లౌవ్రే నుండి లియోనార్డో డా విన్సీ సృష్టించిన అద్భుత కళాఖండం 'మోనాలిసా'ను దొంగిలించాడు. మ్యూజియం ఉద్యోగిగా మారువేషంలో అతను రాత్రంతా దాక్కుని, మరుసటి రోజు ఉదయం ఈ పెయింటింగ్‌ ను దొంగిలించాడు. అయితే.. 1913లో ఇటలీలోని ఫ్లోరెన్స్‌ లో విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు పెయింటింగ్‌ ను తిరిగి పొందారు.

అనంతరం 1956లో మోనాలిసా రెండు దాడుల నుండి బయటపడింది. ఇందులో భాగంగా... ఒక వ్యక్తి రేజర్ బ్లేడుతో పెయింటిగ్ పై దాడి చేయగా.. మరో వ్యక్తి ఆ పెయింటింగ్ పైకి రాయిని విసిరాడు. ఆ దాడుల్లో ఆ చిత్రపటానికి జరిగిన చిన్నపాటి నష్టాన్ని సులభంగా మరమ్మత్తులు చేయగలిగారు.

అనంతరం సుమారు 18 ఏళ్ల తర్వాత 1974లో ఒక మహిళ రెడ్ కలర్ స్ప్రే ను తీసుకుని మ్యూజియంలోకి ప్రవేశించి, పెయింటింగ్ పై స్ప్రే చేసింది. అయితే ఆ పెయింటింగ్ కి ఉన్న సెక్యూరిటీ గ్లాస్ కారణంగా కళాకృతి దెబ్బతినకుండా ఉంది.

తర్వాత మూడు దశాబ్ధాలపాటు మోనాలిసాకు ఎలాంటి ఇబ్బందులు రాకపోయినా... 2009లో ఫ్రెంచ్ పౌరసత్వం నిరాకరించబడినందుకు నిరసనగా ఒక రష్యన్ మహిళ మోనాలిసాపై టీ కప్పును విసిరేసింది. ఆ దాడిలో కూడా సెక్యూరిటీ గ్లాస్ దెబ్బతినకుండా నిరోధించింది.

మళ్లీ దశాబ్ధ కాలం తర్వాత 2022లో ఒక వ్యక్తి మోనాలిసాపై కేక్‌ ను అద్దే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా ఆ కళాకృతి దెబ్బతినకుండా అలాగే ఉంది. మరో రెండేళ్ల తర్వాత 2024లో పలువురు పర్యావరణ కార్యకర్తలు మోనాలిసాను రక్షించే బుల్లెట్ ప్రూఫ్ గాజుపై సూప్ చల్లారు.. ఆ దాడిలో పెయింటింగ్ ఏమాత్రం దెబ్బతినలేదు.

1971లో చిత్రలేఖనం 'ది వేవ్' దొంగతనం!:

1971లో గుస్తావ్ కోర్బెట్ చిత్రలేఖనం 'ది వేవ్' లౌవ్రే మ్యూజియం నుండి దొంగిలించబడింది. ఈ దొంగతనం ప్రొఫెషనల్ దొంగలచే జరిగిందని చెబుతారు. అయితే ఆ చిత్రలేఖనం ఇప్పటికీ ఎక్కడుందో తెలియదు.. అది ఇప్పటికీ ఓ అదృశ్యం రహస్యమే!

1983లో దొంగతనానికి ప్రయత్నం!:

1983లో దొంగలు లౌవ్రే మ్యూజియం నుండి యూజీన్ డెలాక్రోయిక్స్ రాసిన 'లిబర్టీ లీడింగ్ ది పీపుల్' అనే 1830 నాటి ఫ్రెంచ్ విప్లవాన్ని చూపించే కళాఖండాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు. అయితే... ఆ ముఠా దొంగతనం చేసి పారిపోయే ముందు పట్టుబడింది. అదే ఏడాది మ్యూజియం నుండి రెండు కవచాలు దొంగిలించబడ్డాయి. వాటిని 2021లో తిరిగి పొందారు!