Begin typing your search above and press return to search.

షాదీ, లూట్, రిపీట్... స్కామ్ ల యందు ఈ స్కామ్ వేరయా!

అవును... రాజస్థాన్ పోలీసులు హర్యానాలోని గురుగ్రామ్‌ లోని సరస్వతి ఎన్ క్లేవ్ లో దాక్కొన్న యూపీలోని మధురకు చెందిన మహిళను అరెస్ట్ చేశారు.

By:  Raja Ch   |   17 Oct 2025 5:00 PM IST
షాదీ, లూట్, రిపీట్... స్కామ్ ల యందు ఈ స్కామ్ వేరయా!
X

ప్రపంచ వ్యాప్తంగా సంగతి కాసేపు పక్కనపెడితే భారతదేశంలో వివాహ వ్యవస్థపై ఉన్న గౌరవం, నమ్మకంపై రోజు రోజుకీ నీలినీడలు అలుముకుంటున్నాయనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. జీవిత భాగస్వామే యమకింకరులుగా మారుతున్న పరిస్థితులు నిత్యం ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో వివాహాలనే ఆదాయ మార్గాలుగా చేసుకున్న ఓ మహిళ వ్యవహారం సంచలనంగా మారింది.

అవును... రాజస్థాన్ పోలీసులు హర్యానాలోని గురుగ్రామ్‌ లోని సరస్వతి ఎన్ క్లేవ్ లో దాక్కొన్న యూపీలోని మధురకు చెందిన మహిళను అరెస్ట్ చేశారు. ఆ మహిళ పేరు కాజల్ కాగా... సోషల్ మీడియా ప్రపంచం మాత్రం ఆమెను 'దోపిడీ దుల్హాన్' కాజల్ అని పిలుచుకుంటుంది. అరెస్టైన సమయంలో ఆమె జీన్స్, టీ-షర్ట్ ధరించి, చేతులపై గోరింటతో కనిపించడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌ కు చెందిన భగత్ సింగ్, రాజస్థాన్‌ లోని సికార్ నివాసి తారాచంద్ జాట్‌ ను మే 2024లో కలిశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో... జాట్ కుమారులు భన్వర్‌ లాల్, శంకర్‌ లాల్ లను అతని కుమార్తెలు కాజల్, తమన్నాలకు ఇచ్చి వివాహాలు ఏర్పాటు చేయాలని సింగ్ ప్రతిపాదించాడట. ఈ నేపథ్యంలో.. వివాహ సన్నాహాల నెపంతో జాట్ నుండి సింగ్ రూ.11 లక్షలు తీసుకున్నాడు!

ఈ క్రమంలో 2024 మే 21న భగత్ సింగ్.. తన భార్య, కుమారుడు సూరజ్, ఇద్దరు కుమార్తెలు కాజల్, తమన్నాలతో కలిసి ఓ గెస్ట్ హౌస్ కి వచ్చి.. అక్కడ జాట్ కుమారులతో వివాహం జరిపించాడు. వివాహం తర్వాత సింగ్ కుటుంబం అక్కడే రెండు రోజులు బస చేసింది. అప్పుడే అసలు కథ మొదలైంది.. మూడోరోజు బిగ్ ట్విస్ట్ నెలకొంది. కట్ చేస్తే.. సింగ్ ఫ్యామిలీ మొత్తం మిస్!

అవును మూడవ రోజు.. సింగ్, అతని భార్య, కుమారుడితో పాటు నవ వధువులైన ఆయన ఇద్దరు కుమార్తెలు కనిపించకుండా పోయారు. ఇదే సమయంలో ఇంట్లోని నగలు, డబ్బు, దుస్తులు మాయమైపోయాయి. దీంతో.. తారాచంద్ జాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... డిసెంబర్ 18న సింగ్, అతని భార్యను అరెస్టు చేయగా.. విచారణలో మోసపూర్తి మ్యారెజ్ రాకెట్ నడుపుతున్నట్లు వెల్లడించారు.

ఆ తర్వాత పోలీసులు తమన్నా, సూరజ్‌ లను అరెస్టు చేశారు. అయితే.. కాజల్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. అప్పటి నుంచీ ఆమె పరారీలో ఉంది. ఈ క్రమంలో ఇంతకాలం తర్వాత ఆమె అరెస్టు చేయబడింది. వీళ్ల చేతుల్లో సుమారు 10 మందికి పైగా ధన్వంతులైన పురుషులు మోసపోయినట్లు అధికారులు చెబుతున్నారు! ఈ ఘటన సంచలనంగానే కాకుండా పెళ్లి కాని యువకులకు హెచ్చరికగానూ మారిందని అంటున్నారు.