మనిషి ఎంతకాలం బతకాలో నిర్ణయించేవి అవేనట !
ఎవరైనా ఈ భూమి మీదకు వచ్చాక మరణించక తప్పదు. అది మనిషి అయినా సమస్త జీవ రాశులు అయినా.
By: Satya P | 4 Feb 2026 9:20 AM ISTఎవరైనా ఈ భూమి మీదకు వచ్చాక మరణించక తప్పదు. అది మనిషి అయినా సమస్త జీవ రాశులు అయినా. ఏదో నాటికి ఈ దేహాన్ని వీడిపోవాల్సిందే. అయితే ఎవరు ఎంతకాలం బతుకుతారు అన్నది చెప్పడానికి అనేక ప్రమాణాలను తీసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం కానీ అవగాహన కానీ చూస్తే మనిషి మంచి ఆరోగ్యం అలవాట్లు కనుక చేసుకుంటే ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవరచుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారు అన్నది కూడా నిపుణులు చెప్పే మాట. అయితే ఈ విషయం ఇలా ఉంటే అసలు మనిషి ఎంతకాలం బతకాలో చెప్పేది జీన్స్ మాత్రమే అని మరో కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది.
ఆయుర్దాయం పెంచేది :
మనిషి ఆయుర్దాయం పెంచేది జీన్స్ మాత్రమే అని తాజాగా సైన్స్ జర్నల్ లో ప్రచుతిరమైన ఒక అధ్యయనం చెబుతోంది.ఈ అధ్యయనం ప్రకారం మనిషి జీవితం ఆయన జన్యువుల ప్రభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నిర్ధారిస్తోంది. ఈ పరిశోధనను డెన్మార్క్ స్వీడన్ కి చెందిన కవలల వంద ఏళ్ళ నాటి డేటాను బట్టి సైంటిస్టులు నిర్దారించారు.
మనిషి ఆయుష్షుకు :
రోడ్ యాక్సిడెంట్లు ఇతర ప్రమాదాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటి వల్ల సంభవించే మరణాలను పక్కన పెడితే మనిషి అధిక కాలం జీవించడానికి జన్యువుల పాత్ర కీలకంగా ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. గతంలో చూస్తే జన్యువుల ప్రభావం మనిషి ఆయు ప్రమాణాలను పెంచడంలో కేవలం పది నుంచి పాతిక శాతం మాత్రమే ఉంటుంది అనుకుంటే ఈ పరిశోధనతో అది కాస్తా 55 శాతం మేర ప్రభావం చూపిస్తుందని చెబుతోంది.
ఎక్కువ కాలం బతకాలంటే :
ఎవరైనా ఎక్కువ కాలం బతకాలీ అంటే వారి జీన్స్ తోనే అది సాధ్యపడుతుంది అని ఈ పరిశోధన చెబుతోంది. ఆ జీన్స్ లో లాంగ్ లైఫ్ ఉంటే కనుక అది జరుగుతుందని అంటోంది. ఇక పుట్టుకతోనే కొంత వరకూ మనిషి శరీరం గరిష్టంగా ఎంత కాలం బతకగలదు అన్నది ఒక నిర్ధారణకు వస్తుందట. జీన్స్ 55 శాతం పాత్ర పోషిస్తే ఆ మిగిలిన 45 శాతం మంచి అలవాట్లు జీవన విధానం మీద మనిషి అధిక జీవితం అన్నది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు
వీటిని తట్టుకుంటేనే :
అయితే కాలుష్యంతో పాటు పౌష్టిక ఆహార లోపం, సుగర్, స్థూల కాయం వంటి అనేక సమస్యలు జీన్స్ మీద తీవ్ర ప్రభావం చూపించి ఆయుర్ధాయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తయాని భారతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తునారు. ఇక లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే జీన్స్ లో యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది, లేదా ఏకంగా నిలిచిపోవడం జరుగుతుందని కూడా చెబుతున్నారు. అంటే టోటల్ గా చెప్పేది ఏంటి అంటే జీన్స్ ఎంత బాగా ఉన్నా తగిన విధంగా మనిషి అలవాట్లు కూడా ఉండాలని ఇలా బాలెన్స్ చేసుకుంటూ ఉండే వారు పూర్ణాయుష్కులని అంటున్నారు వైద్య నిపుణులు.
