ప్రధాని పాఠాలు.. బాగానే వంటబట్టాయే.. !
``ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నా`` అని ఇటీవల మంత్రి నారా లోకే ష్ మీడియాకు చెప్పిన విషయం గుర్తుందా?.. ఇప్పటి వరకు ప్రధానిని ఆయన స్వయంగా రెండుసార్లు కలుసుకున్నారు
By: Garuda Media | 12 Sept 2025 6:00 AM IST``ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నా`` అని ఇటీవల మంత్రి నారా లోకే ష్ మీడియాకు చెప్పిన విషయం గుర్తుందా?.. ఇప్పటి వరకు ప్రధానిని ఆయన స్వయంగా రెండుసార్లు కలుసుకున్నారు. ఒకసారి ఫ్యామిలీతో వెళ్లి.. ఢిల్లీలో భేటీ అయ్యారు. `యువగళం` పాదయాత్రకు సంబం ధించిన పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం.. మరోసారి ఇటీవల నారా లోకేష్ ప్రధానిని కలుసుకు న్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన ప్రధానితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగానే జాతీయ మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు.. ప్రధాని నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్టు తెలిపారు. అయితే.. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సాధారణమేనని అనుకున్నా.. తాజాగా లోకేష్ వ్యవహార శైలిని గమనిస్తే.. ఆయన నిజంగానే ప్రధాని దగ్గర పాఠాలు నేర్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. ప్రధాని శైలి భిన్నంగా ఉంటుంది. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు లేదా.. ప్రజలకు అవసరమైన ప్పుడు. ఇతర కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకుంటారు. ఉదాహరణకు పహల్గాం ఉగ్రదాడి సంభవిం చినప్పుడు.. ప్రధాని హుటాహుటిన విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు.
అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భుజ్‌లో భూకంపం సంభవించినప్పుడు కూడా ఆయన హుటాహుటిన స్పందించారు. బాధితులను ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా.. ప్రజాకో ణంలో స్పందించడం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ విశేషం. ఇక, ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయం లోనూ ఆయన స్పందన డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రత్యర్థులు చేసే విమర్శలకు ఆయన వెనువెంటనే స్పందించరు. సమయం సందర్భం చూసుకుని రియాక్ట్ అవుతారు. దీనివల్ల రాజకీయంగా మోడీకి మంచి మార్కులు పడ్డాయి. పడుతున్నాయి కూడా.
అచ్చం.. ఇవన్నీ నారా లోకేష్‌కు ఆయన చెప్పారా? లేదా? అనేది పక్కన పెడితే.. కొంత వరకు నారా లోకే ష్ అనుసరిస్తున్న విధానాలు.. ప్రజలకు చేరువ అవుతున్న తీరు వంటివి గమనిస్తే.. ఖచ్చితంగా నారా లోకేష్.. రాజకీయాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. వైసీపీ నాయకులు చేసే విమర్శలకు ఆయన షార్ప్‌గా సమాధానం చెప్పడమే కాదు.. సమయం చూసుకుని.. రియాక్ట్ అవుతున్నారు. ఇది రాజకీయంగా లోకేష్‌కు కలిసి వచ్చే పరిణామమని అంటున్నారు పరిశీలకులు. తాజాగా నేపాల్ బాధితులను ఆదుకున్న తీరుతో పాటు.. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆయన ఇస్తున్న కౌంటర్లు వంటివి రాజకీయంగా ఆయన ఎదుగుదలకు నిదర్శనంగా ఉన్నాయని చెబుతున్నారు.
