Begin typing your search above and press return to search.

పవన్ లోకేష్ అన్నదమ్ముల బంధానికి అసలైన పరీక్ష ?

సాధారణంగా ఒకే పార్టీలోనే ఇద్దరు నాయకుల మధ్యన పొసగని పరిస్థితి ఉంటుంది. రాజకీయాలు అంటేనే అదే మరి.

By:  Satya P   |   3 Oct 2026 4:00 AM IST
పవన్ లోకేష్ అన్నదమ్ముల బంధానికి అసలైన పరీక్ష ?
X

సాధారణంగా ఒకే పార్టీలోనే ఇద్దరు నాయకుల మధ్యన పొసగని పరిస్థితి ఉంటుంది. రాజకీయాలు అంటేనే అదే మరి. అలాంటిది వేరు వేరు పార్టీలు. అలాగే లక్ష్యాలు ఆకాంక్షలు కూడా ఒకటే అయినపుడు పోటీ ఉన్నపుడు కచ్చితంగా పొరపొచ్చాలు అన్నవి వస్తాయి. అది సహజం కూడా. కానీ విచిత్రంగా ఏపీలో అధికార కూటమిలో ఉన్న మిత్ర పక్షాల మధ్య భేదాలు అయితే ఎక్కడా తలెత్తడం లేదు. అధికారంలోకి వచ్చాక ఉండే ఆధిపత్య పోరు కానీ రాజకీయ తీరు కానీ అసలు కనిపించడం లేదు. అదే సమయంలో టీడీపీ జనసేనల మధ్యన బంధం మరింత పటిష్టంగా ఉంది అని గుర్తు చేస్తున్నారు.

పవన్ అన్నా అంటూ :

నారా లోకేష్ అయితే పవన్ ని చూసి అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారు. పవన్ సైతం అంతే అభిమానంగా ఆళింగనం చేసుకుంటారు. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రానికి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి వచ్చిన పవన్ ని లోకేష్ రిసీవ్ చేసుకున్న తీరు అయితే అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరూ ఎంతో అభిమానంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత వేదిక మీద కూడా ఇద్దరూ సరదాగా గడిపారు. ఈ సన్నివేశాలు చూసిన వారు టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ ఉందంటే అసలు అంగీకరించే ప్రసక్తి లేదని అంటున్నారు. అంతే కాదు ఇటీవల కాలంలో పవన్ కి నారా లోకేష్ కి మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు కూడా చెక్ పెట్టేలా ఈ ఇద్దరి సాన్నిహిత్యం ఉందని అంటున్నారు.

ఆ ఊహాగానాలతోనే :

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎనభై శాతం సీట్లకు పోటీ చేస్తుందని జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం సీట్లు కేటాయిస్తుందని లోకేష్ టీడీపీ సమావేశంలో అన్నట్లుగా అప్పట్లో ప్రచారం అయింది. ఇదంతా ఊహాగానాలే అని ఎంత చెప్పినా ఎందుకో అది అలా వైరల్ అయింది. దాని మీద జనసేన వర్గాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ముప్పై శాతం సీట్లు తీసుకుంటామని పదే పదే ప్రకటించాయి. 2024 ఎన్నికల ఫార్ములా కాదు 2026 ఎన్నికల ఫార్ములానే అనుసరిస్తామని కూడా గట్టిగా చెప్పాయి. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వాటా తేల్చుకోవాలని జనసేన చూస్తోంది అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కలసి మెలసి ఉండడంతో గ్యాప్ అన్నది ఏదీ లేదని అంటున్నారు.

డిమాండ్ కి తగినట్లుగానే :

అయితే నాయకుల మధ్య అభిమానాలు ఆప్యాయతలు వేరు. అవి రాజకీయాలకు అతీతంగా కొనసాగవచ్చు అని అంటున్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు తమ లక్ష్యాలను కూడా చూసుకుంటాయని అంటున్నారు. అందువల్ల జనసేన కోరినట్లుగా 30 శాతం సీట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. అలా కనుక జరగక పోతే మాత్రం జనసేనలో అసంతృప్తి పెరుగుతుందని అంటున్నారు. అంతే కాదు పార్టీ క్యాడర్ కూడా డీ మోరలైజ్ అవుతుందని అంటున్నారు. అందువల్ల సీట్ల విషయంలోనే అన్నీ తెలుస్తాయని అంటున్నారు. తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అని ఒక ముతక సామెత ఉంది. దానినే అమలు చేయాలన్నది జనసేన కోరుకుంటోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా తమ డిమాండ్ మేరకు సీట్లు తీసుకుని పోటీ చేసినట్లు అయితే గ్రౌండ్ లెవెల్ లో జనసేన బలపడుతుందని అంటున్నారు. ఆ విధంగా జనసేనకు 30 శాతం సీట్లు దక్కితే కనుక పవన్ లోకేష్ అన్న దమ్ముల బంధం మరింతగా బలోపేతం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.