జగన్ కి సీసీడీ ప్రాబ్లం....ఏంటది ?
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి సీసీడీ ప్రాబ్లం నా. ఇంతకీ ఏంటది, అంటే దాని గురించి చాలానే చెప్పాల్సి ఉంది మరి.
By: Satya P | 30 March 2026 6:00 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి సీసీడీ ప్రాబ్లం నా. ఇంతకీ ఏంటది, అంటే దాని గురించి చాలానే చెప్పాల్సి ఉంది మరి. అసలు సీసీడీ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మంత్రి నారా లోకేష్ స్పీచ్ ని వినాల్సిందే. తెలుగుదేశం పార్టీ 45 వ వార్షికోత్సవాల సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ క్యాడర్ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు అదే సమస్య :
జగన్ కి అదే సమస్యగా ఉందని లోకేష్ అన్నారు. సీసీడీతో జగన్ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సీసీడీ అంటే ఏంటో లోకేష్ ఫుల్ ఫాం లో దానిని విడమరచి చెప్పారు. క్రెడిట్ చోరీ డిస్ ఆర్డర్ అంట. ఈ సమస్యతోనే జగన్ సతమతమవుతున్నారని లోకేష్ అన్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న జగన్ కి కూటమి చేసే ప్రతీ పనీ క్రెడిట్ చోరీగా కనిపిస్తోంది అని లోకేష్ సెటైర్లు వేశారు. కూటమి తలపెడుతున్న ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా తామే చేశామని జగన్ చెప్పుకోవడం మీద లోకేష్ ఈ విధంగా విమర్శించారు అన్న మాట.
అవన్నీ అంతే :
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అయినా ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అయినా తామే దానిని తెచ్చామని జగన్ చెప్పుకుంటున్నారు అని లోకేష్ విమర్శించారు. మరో వైపు చూస్తే కూటమి మీద విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. నిజానికి అవి ఎవరి హయాంలో వచ్చాయో అందరికీ తెలిసిందే అని లోకేష్ చెప్పారు. జగన్ సీసీడీ ప్రాబ్లం తో ఇబ్బంది పడడం వల్లనే ఈ విధంగా మాట్లాడుతున్నారని లోకేష్ విమర్శించారు. అందుకే ఆయన తొందరగా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని లోకేష్ వ్యాఖ్యానించడం విశేషం.
టీడీపీ వన్ అండ్ ఓన్లీ :
దేశంలో ఎన్నో రికార్డులు కలిగిన పార్టీ క్యాడర్ ని కూడా సొంత ఫ్యామిలీగా చూసుకుంటూ వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న పార్టీ టీడీపీ ఒక్కటే అని లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఏకంగా కోటికి చేరుకోవడం విశేషం. అన్నారు. ఇక కార్యకరతలకు బీమా పధకం అమలు చేస్తున్నామని దానిని రెండు లక్షల నుంచి అయిదు లక్షల దాకా పెంచామని లోకేష్ చెప్పారు. పార్టీయే అందరికీ అధినేత అని లోకేష్ చెప్పారు. పార్టీ ఉంటేనే అంతా అన్నది తెలుసుకోవాలని చెబుతూ మరోసారి వైసీపీని ఉదహరించారు. 151 సీట్లు ఉన్న వైసీపీ 11కి పడిపోయింది ఎలాగో తెలుసు కదా అన్నారు. అందుకే ప్రతీ నాయకుడూ కార్యకర్తలను పలకరించాలని వారి సమస్యలు తెలుసుకోవాలని అలాగే ప్రజలతో మమేకం కావాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
