బుర్రకు ఛార్జింగ్ ఎలాగంటే... తెరపైకి ఆసక్తికర విషయం!
ఇటీవల కాలంలో చాలా మందికి మతిపరుపు, అల్జీమర్స్ వ్యాధి అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే!
By: Raja Ch | 9 Aug 2025 10:46 AM ISTఇటీవల కాలంలో చాలా మందికి మతిపరుపు, అల్జీమర్స్ వ్యాధి అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో... మెదడులోని ముఖ్య కణాలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో లిథియం ప్రధాన పాత్ర పోషిస్తుందని అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. వాస్తవానికి దీనిపై 19, 20 శతాబ్ధాల ప్రారంభంలోనే ప్రచారం జరిగిందని చెబుతున్నారు.
అవును.. 19, 20 శతాబ్దాల ప్రారంభంలో లిథియం మానసిక స్థితిని మార్చే ఆరోగ్య టానిక్ గా ప్రచారం చేయబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బైపోలార్ డిజార్డర్ కు ఇది ప్రామాణిక చికిత్సగా ఉద్భవించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో.. లిథియం తీసుకోని వారి కంటే, లిథియం తీసుకునేవారిలో మెదడు వృద్ధాప్యం నెమ్మదిగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ సందర్భంగా... మెదడులోని సహజ లిథియం నిల్వలను తిరిగి నింపడం వల్ల అల్జీమర్స్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని, దాన్ని తిప్పికొట్టవచ్చని చెబుతున్నారు. తాజాగా మానవ మెదడు కణజాల విశ్లేషణలు, ఎలుకలపై చేసిన తాజా ప్రయోగాలు స్థిరమైన నమూనాను సూచిస్తుందని చెబుతున్నారు. మెదడులో లిథియం సాంద్రతలు క్షీణించినప్పుడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం ఎక్కువవుతుందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మసాచుసెట్స్ లోని బోస్టన్ లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో జన్యు శాస్త్రవేత్త సహ రచయిత బ్రూస్ యాంక్నర్... ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా చిత్తవైకల్యం ప్రజలను ప్రభావితం చేస్తుందని.. వారిలో చాలా మందికి అల్జీమర్స్ వ్యాధి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రుగ్మతకు చికిత్స చేయడానికి ఒక కొత్త మార్గం లభించినట్లయిందని అన్నారు!
