Begin typing your search above and press return to search.

సగటు ఆయుష్షు పెరిగింది...జపాన్ దే అగ్ర తాంబూలం

మనిషి జీవన ప్రమాణం పెరిగింది. ఆయుర్దాయం కూడా ఇంకా పెరిగింది. ఒకనాటి తో పోలిస్తే ఇపుడు మరింత జీవితం దక్కుతోంది.

By:  Satya P   |   25 Nov 2025 9:25 AM IST
సగటు ఆయుష్షు పెరిగింది...జపాన్ దే అగ్ర తాంబూలం
X

మనిషి జీవన ప్రమాణం పెరిగింది. ఆయుర్దాయం కూడా ఇంకా పెరిగింది. ఒకనాటి తో పోలిస్తే ఇపుడు మరింత జీవితం దక్కుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి కానీ మనిషి సగటు ఆయుర్ధాయంలో గణనీయమైన ఈ పెరుగుదలలో భారత్ కి కూడా స్థానం ఉండడమే విశేషంగా చెప్పుకోవాలి. గత ఆరు దశాబ్దాల కాలాన్ని చూస్తే కనుక ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ సగటు మనిషి ఆయుష్షు పెరిగింది అని నివేదికలు చెబుతున్నాయి.

జపాన్ గ్రేట్ :

జపాన్ లో ఎక్కువ కాలం జీవించే వారు ఉంటారని అందరికీ తెలిసిందే. ఇపుడు ప్రపంచ గణాంకాలు చూసినా జపాన్ దే అగ్ర స్థానంగా ఉంది. చైనా కూడా అమెరికాతో సమానంగా ఆయుష్షుని పెంచుకుంది. భారత్ విషయమే తీసుకుంటే అరవై ఏళ్ళ క్రితం సగటు భారతీయుడు జీవిత కాలం కేవలం 46 ఏళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు అది ఏకంగా 72 కి చేరింది. దాంతో భారత్ లో కూడా మనిషి జీవిత కాలం బాగానే ఉన్నట్లు అయింది.

ఆధునిక వైద్యంతో పాటు :

గతంతో పోలిస్తే ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. దాంతో పాటు జీవన ప్రమాణాలు కూడా బాగానే పెరిగాయి. వీటి వల్లనే ఆయుష్షు కూడా పెరిగింది అని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన వైద్య సేవలు ఇపుడు లభ్యమవుతున్నాయి. అలగే పరిశుభ్రతతో కూడిన జీవితం గతానికి పోలిస్తే ఎక్కువగానే దక్కుతోంది. మరో వైపు చూస్తే ప్రపంచ సగటు ఆయుర్దాయం అరవై ఏళ్ళ క్రితం 51 ఏళ్ళు అయితే ఇపుడు అది కాస్తా 73.3గా ఉంది. కరోనా వంటి మహమ్మారి వచ్చి కొంత ఆయుష్షుని తగ్గించినా అది తాత్కాలికంగానే ఉంది. మళ్ళీ పూర్వం మాదిరిగానే మనిషి జీవిత కాలం పెరిగింది.

గణాంకాలు చూస్తే కనుక :

ఇక ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం గణాంకాల ప్రకారం చూస్తే కనుక అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో ఉందిని చెప్పాలి. అక్కడ 1960లోనే అక్కడ సగటు ఆయుష్షు 68 ఏళ్లుగా ఉంది. ఇక అది ఇపుడు ఏకంగా 84 ఏళ్లకు పెరిగింది. అదే విధంగా ఇటలీ వంటి యూరోపియన్ దేశాలలో చూస్తే సగటు ఆయుర్దాయం 83.7 ఏళ్లుగా ఉంది. ఇక్కడ మంచి ఆరోగ్యకరమైన సమ్రక్షణ వ్యవస్థలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అలాగే అక్కడ ప్రజానీకం కూడా మంచి ఆహారం అలవాట్లను చేసుకున్నారని అంటున్నారుఇ.

అమెరికా తీరు అలా :

ప్రపంచ సగటు ఆయుష్స్షు అనేక దేశాలలో భారీ పెరుగుదలను చూపించగా అమెరికాలో మాత్రం అది నెమ్మదిగానే ఉంది అని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికలో 1960లో సగటు వయసు 70 ఏళ్ళుగా ఉంది. అయితే ఇపుడు మరో ఎనిమిదేళ్ళు మాత్రమే పెరిగి అది 78.4 ఏళ్లకు చేరింది. ఆ దేశంలో ఉన్న ఆరోగ్య సమస్యలలో ఊబకాయం, ఆరోగ్య సంరక్షణ లో కొన్ని రకాలైన అసమానతలు వంటివి కారణాలుగా చెబుతున్నారు. ఇక పొరుగున ఉన్న చైనా దేశం అయితే సగటు ఆయుష్షు విషయంలో గణనీయమైన పురోగతిని సాధించింది. 1960లో చైనాలో సగటి ఆయుష్షు అయితే చాలా తక్కువగా 33 ఏళ్లుగా ఉంది. ఇక ఇపుడు అక్కడ సగటు ఆయుర్దాయం ఏకంగా 78 ఏళ్లకు పెరిగి అమెరికాతో సరిసమానం అయింది. అంటే అక్కడ హెల్త్ పట్ల తీసుకునే జాగ్రత్తలు ఇతర ఆహార అలవాట్లు సర్కార్ తీసుకునే నిర్ణయాలు అన్నీ కలిసి ఈ విధంగా ఉన్నాయని అంటున్నారు.