పేరుతోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఏకంగా 2253 పదాలు..
ఇక ఈ విషయం బయటపడడంతో ప్రపంచంలోనే అత్యంత పొడవాటి పేరు కలిగి ఉన్న వ్యక్తిగా లారెన్స్ వాటికిన్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.
By: Madhu Reddy | 11 Oct 2025 5:00 PM ISTకొంతమంది తమ పేరు అందరికంటే స్పెషల్ గా నిలవడం కోసం,అందరిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం ఏదో ఒక స్పెషాలిటీ ఉన్న పని చేస్తూ ఉంటారు. కొంతమంది చదువు తో మరి కొంతమంది తాము చేసే పనులు, ఇలా ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా నిలిచి.. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు. అయితే అందరిలాగే ఈ వ్యక్తి కూడా ఆలోచించారో ఏమో తెలియదు కానీ ఏకంగా 2,253 పదాలతో ఉన్న పొడవాటి పేరును పెట్టుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. మరి ఇంతకీ అంత పెద్ద పొడవాటి పేరును పెట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇంత పెద్ద పేరును పెట్టుకున్నారు? దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూజిలాండ్ కి చెందిన లారెన్స్ వాటికిన్స్..ఇప్పుడు ఈయన పేరే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దానికి ప్రధాన కారణం ఈయన పేరే.. చాలామంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తమ పేరు ఉండాలి అనుకుంటారు. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించి తన పేరుతోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.. న్యూజిలాండ్ కి చెందిన లారెన్స్ వాటికిన్స్ పేరు ఏకంగా 2,253 పదాలతో కూడా ఉంటుందట. దాదాపు ఓ కిలోమీటర్ పొడవు కంటే ఎక్కువగా ఉండే ఆయన పేరుతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. అయితే ఏదైనా ఒక వింత పనిచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవాలి అని లారెన్స్ ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే వింత వింత పనులు చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న వారంటే తనకి చాలా ఇష్టమట.
అందుకే ఆయన కూడా ఏదైనా ఒక వింత పని చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవాలి అనుకున్నారట.అలా గిన్నిస్ బుక్ రికార్డులని చూస్తున్న సమయంలో తన పేరుతోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవచ్చు అని తెలుసుకున్నారు. అలా తన పేరులో 2000 పదాలు చేర్చుకోవాలని తన స్నేహితులు, సహా ఉద్యోగులతో కలిసి ప్రయత్నాలు చేశారు. మొదట తన పేరులో ఎక్కువ పదాలు చేర్చుకోవడం గురించి 1990లో జిల్లా కోర్టుని ఆశ్రయించారు. ఆ సమయంలో జిల్లా కోర్టు ఆయన పేరుని పెంచుకునే అనుమతిని ఇచ్చింది. కానీ ఈ విచారణ జరిగే సమయంలో రిజిస్ట్రార్ జనరల్ దానికి ఒప్పుకోకపోవడంతో వెంటనే లారెన్స్ హైకోర్టులో అప్పీల్ చేశారు. అయితే హైకోర్టు విచారణ జరిపి పేరు పెంచుకోవడానికి అనుమతిని కల్పించింది.
దాంతో లారెన్స్ వాటికిన్స్ తన పేరుని ఏకంగా 2,253 పదాలతో పెట్టుకున్నారు. ఇక ఈ విషయం బయటపడడంతో ప్రపంచంలోనే అత్యంత పొడవాటి పేరు కలిగి ఉన్న వ్యక్తిగా లారెన్స్ వాటికిన్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. అలా ఒక వింత పని చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలి అనుకున్న లారెన్స్ కి తన పేరు కారణంగా అనుకున్నది సాధించారు.
ఈయన న్యూజిలాండ్లో స్థానికంగా ఉండే ఓ లైబ్రరీలో వర్క్ చేస్తారు. అలా తన సహోద్యోగులు, ఫ్రెండ్స్ సహాయంతో పేరుని పెంచుకున్నారు. అలాగే తన ఫ్రెండ్స్ ,సహోద్యోగులు అందరూ తనను ఏ టు జెడ్ 2000 అని పిలుస్తారని,ఈ పేరుతో పిలిపించుకోవడం తనకు చాలా ఇష్టం అంటూ లారెన్స్ చెప్పుకొచ్చారు. అలా ప్రపంచంలోనే అత్యంత పొడవాటి పేరుతో లారెన్స్ వాటికిన్స్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు.
