అక్కడ మహిళలే మగాళ్లను అద్దెకు తీసుకుంటారు!
ఒకప్పడు ఆడపిల్లలు అంగట్లో సరుకులా అమ్మేవారని పురాతన కాలంలో మన తాతలు, తండ్రులు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడ మన బాలయ్య సినిమాల్లోలాగా ట్రెయిన్ రివర్స్ అయిపోయింది
By: A.N.Kumar | 6 Dec 2025 1:00 AM ISTఒకప్పడు ఆడపిల్లలు అంగట్లో సరుకులా అమ్మేవారని పురాతన కాలంలో మన తాతలు, తండ్రులు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడ మన బాలయ్య సినిమాల్లోలాగా ట్రెయిన్ రివర్స్ అయిపోయింది. ఔను మహిళామణులకు సర్వ శక్తులు, హక్కలు వచ్చేసి పాపం మగాళ్లే అంగడి సరుకులు అయిపోతున్నారు. పురుషులకు ప్రస్తుతం పెళ్లిళ్లు కావడం లేదు. ఎందుకంటే అమ్మాయిల కోరికలు ఎక్కువ.. మగాళ్లకు ఆస్తులు తక్కువ ఉంటే అతడు బ్యాచ్ లర్ గానే మిగిలిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదంతా కూడా 90వ దశకం తర్వాత ఆడపిల్లల భ్రూణహత్యలు, కడుపులోనే చంపేయడంతో ఇప్పుడు మగాళ్లు ఎక్కువై ఆడవాళ్లు తక్కువయ్యారు. హర్యానా లాంటి చోట్ల మగాళ్లకు ఆడవాళ్లే దొరకని పరిస్థితి నెలకొంది.
మన దేశంలో ఇంతలా పరిస్థితి ఉంటే లాత్వియా అనే దేశంలో మాత్రం పూర్తి డిఫెరెంట్ వాతావరణం ఉంది. లాత్వియా దేశంలో పురుషుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో మహిళలు తమ అవసరాలు తీర్చుకునేందుకు మగాళ్లను అద్దెకు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన నివేదికలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
లాత్వియా దేశంలో పురుషుల కంటే మహిళలు 15.5 శాతం మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో పంబ్లింగ్, కార్పెంటరీ, రిపేర్లు , పెయింట్లు వంటి పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్లను అక్కడ అద్దెకు తీసుకుంటున్నారు.
ఇక లాత్వియా దేశ అమ్మాయిలకు పెళ్లిళ్లు కాక తమ జీవిత భాగస్వాముల కోసం ఏకంగా దేశం దాటి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. గంటల ప్రాతిపదికన మగాళ్లతో పనిచేయించుకోవడం బ్రిటన్ లో కూడా ఉంది.
ఇక లాత్వియా దేశంలో ఆడవాళ్ల జనాభా ఎక్కవ కావడంతో వారి మీద అంతగా ఆంక్షలు ఉండవు. పైగా అక్కడ వరకట్నం వంటి వ్యవహారాలు అసలే ఉండవు. అందువల్ల అక్కడ ఆడవాళ్ల సంఖ్య ఎక్కువైంది. ఆడవాళ్లు పుడితే అదృష్టంగా భావించడం వారి సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. దీనివల్ల ఇక్కడ ఆడవాళ్లక జన్మ ఇవ్వడానికి ఆసక్తి చూపించేవారు. దీంతో వారి జనాభా బాగా పెరిగింది. జనాభాలో మగాళ్లు తక్కువై లింగభేదం ఎక్కవైంది. పురుషులు అవసరాలకు లేకపోవడంతో మహిళలు ఇక్కడ డబ్బులు ఇచ్చి మరీ తమ అవసరాలకు మగాళ్లను బుక్ చేసుకుంటున్నారు.
ఇక లాత్వియా దేశంలో అత్యవసర సర్వీసులలో పనిచేయడానికి పురుషులు లేకపోవడంతో ఎక్కువ డబ్బులు చెల్లించడానికి అక్కడ ప్రజలు సిద్ధమవుతున్నారు. మగాళ్ల మాత్రమే పనిచేసే విభాగాలలో గంటల లెక్కన డబ్బు చెల్లిస్తూ పనిచేయించుకుంటున్నారు. ఫలితంగా ఈ దేశం వార్తల్లో నిలిచింది. ప్రస్లుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
