Begin typing your search above and press return to search.

చనిపోయే ముందు తీవ్ర భావోద్వేగం ఉంటుందా ?

ఎవరైనా పోవాల్సిందే. కాస్తా వెనకా ముందు అంతే. పుట్టిన వాడు గిట్టక మానడు అన్నది భగవద్గీత చెప్పిన సత్యం. ఇతర మత గ్రంధాలు అదే చెబుతున్నాయి.

By:  Satya P   |   23 Feb 2026 11:15 PM IST
చనిపోయే ముందు తీవ్ర భావోద్వేగం ఉంటుందా ?
X

ఎవరైనా పోవాల్సిందే. కాస్తా వెనకా ముందు అంతే. పుట్టిన వాడు గిట్టక మానడు అన్నది భగవద్గీత చెప్పిన సత్యం. ఇతర మత గ్రంధాలు అదే చెబుతున్నాయి. ఇక ఈ లోకం నుంచి వీడుకోలు టాటా చెప్పాల్సిన వేళ మనిషి ఎలాంటి భావోద్వేగాలకు లోను అవుతాడు, అసలు మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఎంతో గొప్ప ఆసుపత్రిలో ఉంచుతారు, అన్ని రకాలైన సదుపాయాలు కలిగిస్తారు. కానీ మరణం ఏ తోవన వస్తుందో ఎవరికీ తెలియదు. వైద్య పరికరాలు చూస్తే అంతా కరెక్ట్ గానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఏ సైన్స్ కి అందని విధంగా చావు అన్నది తమను సమీపిస్తోంది అన్నది మనిషికి తెలిసిపోతుంది. అపుడు అతను చెప్పే చివరి మాటలు ఎలా ఉంటాయి అంటే ఆలోచనకు అందదు. కానీ ఆ చివరి మాటలను ఎన్నో వందల మంది రోగుల వద్ద విన్న ఒక నర్సు తన అనుభవాలను తాజాగా వెల్లడించింది.

వారితోనే ఉంటూ :

ఫ్లోరిడాకు చెందిన ఒక మూడు పదులు వయసు ఉన్న నర్సు పేరు కిర్ల్స్టీ రాబర్ట్స్. ఆమె నాలుగేళ్ళకు పైగా అక్కడి ఒక ఆసుపత్రిలో ఐసీయూ విభాగంలో పనిచేస్తోంది. ఆమె తన సర్వీసులో ఎంతో మంది రోగుల ఆఖరు క్షణాలను కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి. ఆమె తాజాగా ఈ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇపుడు ఆ పోస్టు అయితే సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతోంది.

చావు ఇచ్చే సిగ్నల్స్ :

చావు ఎలా ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు, కానీ అది ఇచ్చే సిగ్నల్స్ మాత్రం చనిపోయిన వారికి తెలుస్తాయి. అందుకే వారి మాటలు అప్పుడు ప్రత్యేకంగా ఉంటాయని ఫ్లోరిడా నర్స్ చెబుతోంది. ఆ నర్స్ గమనించినది కొన్ని రకాలైన సిగ్నల్స్ అయితే పేషంట్లకు వస్తాయని. అవి ఏమిటి అన్నది ఆమె వరసగా చెప్పుకుంటూ వెళ్ళారు. మరణానికి అతి సమీపంలో ఉన్న వారు అంతా ఒకే విధంగా భావోద్వేగాలకు లోను అవుతారుట. అంతే కాదు వారికి తమకు చావు తోసుకుని వస్తోంది అని తెలుస్తుందిట. అందుకే వారు చెప్పే చివరి మాటలు ఏంటంటే తమ ఫ్యామిలీ అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆ విషయం తమ కుటుంబ సభ్యులకు చెప్పమని కోరుతారుట. అంతే కాదు తమని ఎవరో పిలుస్తున్నారు ఏవేవో కనిపిస్తున్నాయని కూడా చెబుతారట.





పశ్చాత్తాపంతో :

ఇక వారికి జీవితం మొత్తం సినిమా రీల్స్ మాదిరిగా కళ్ల ముందు కనిపిస్తుందట. అందుకే తాము ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుతారుట. అంతే తమకు శరీరమంతా ఎంతో ఇబ్బందిగా ఉందని అసలు బాగా లేదని తమకు జీవితం అయిపోయిందని గ్రహిస్తారుట. ఇక అదే సమయంలో తమకు ఎంతో ప్రశాంతంగా ఉందని కూడా అంటారుట. వారిలో ఆ క్షణాన భయం అన్నది పోయి ఏందో శాంతి ఆవహిస్తుందిట. మరో వైపు చూస్తే తమను గట్టిగా పట్టుకోవాలని తమ వద్దనే ఉండాలని నర్సులను కోరుతారుట. ఇక చివరికి వారు చెప్పే మాట ఏంటి అంటే థాంక్యూ అని. అంటే తమకు సేవ చేసిన నర్సులతో పాటు ఈ లోకంలో తమకు అన్ని విధాలుగా సహకరించిన వారందరికీ వర్తించేలా ఆ థాంక్స్ ఉంటుందిట.

వైద్యానికి చిక్కనిది :

ఈ రకమైన ఫీలింగ్స్ అన్నవి ఏ వైద్య శాస్త్రం గమనించలేదు, రికార్డు కూడా చేయలేదు అని అంటున్నారు. ఒక విధంగా చావుకు దగ్గర అయిన వారు పూర్తిగా ఆధ్యాత్మిక భావనతో ఉంటారు అని అంటున్నారు. ఆత్మ శరీరాన్ని వీడే ముందు జరిగే మార్పులుగా ఫ్లోరిడా నర్స్ కిర్ల్స్టీ రాబర్ట్స్ అంటున్నారు. ఈ విధంగా వారు ప్రవర్తించే తీరుని ఎన్నో ఏళ్ళుగా గమనిస్తున్న కిర్ల్స్టీ రాబర్ట్స్ ఇది ఏ వైద్య మిషన్ కూడా కనిపెట్టలేని అనుభూతి అని అంటున్నారు. ఇదిలా ఉంటే కిర్ల్స్టీ రాబర్ట్స్ చెప్పిన దానిని బట్టి చూస్తే ఒక విషయం అయితే అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఉన్న జీవితంలో చురుకుగా బతికినంత కాలం ఎవరినీ ద్వేషించకుండా ఎవరి మీద కక్షలు పెంచుకోకుండా వీలైనంతవరకూ ఉంటూ ప్రేమను పంచుతూ జీవించడమే ఉత్తమమని అంటున్నారు.